BigTV English

IND vs ENG Test Series : ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే.. ఉచితంగా ఎలా చూడాలి

IND vs ENG Test Series : ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే.. ఉచితంగా ఎలా చూడాలి

IND vs ENG Test Series :  ప్రస్తుతం భారత్ లో ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే లీగ్ దశ మ్యాచ్ లు నిన్నటితో పూర్తయ్యాయి. ఇక రేపటి నుంచి ప్లే ఆప్స్ లో క్వాలిఫయిర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయిర్ 2, ఫైనల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. జూన్ 03 ఫైనల్ తో ఐపీఎల్ సీజన్ ముగుస్తుంది. 29 రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి వెళ్తోంది. అలాగే 30 రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. అందులో విజయం సాధించిన జట్టు క్వాలిఫయిర్ 1లో ఓడిపోయిన జట్టు క్వాలిఫయిర్ 2 ఆడుతుంది. అందులో విజయం సాధించిన జట్టు ఫైనల్ కి వెళ్తుంది. జూన్ 03న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసాక టీమిండియా (Team India) ఆటగాళ్లకు ఇంగ్లండ్ (England) తో టెస్ట్ సిరీస్ ఉండనుంది.


Also Read :  India beat Pakistan : ఓడినా సిగ్గు లేదుగా.. పాకిస్థాన్ కు ఎందుకు ఇంత బలుపు

ఇక జూన్ 20 నుంచి ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ముగిసిన 17 రోజులకే ఈ మెగా సిరీస్ ప్రారంభం కానుంది. 2025-2027 టెస్ట్ సైకిల్ లో భాగంగా.. ఇరు జట్లకు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ కి ఇప్పటికే భారత టెస్ట్ జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. మరోవైపు ఇటీవలే ఇంగ్లాండ్ జట్టు జింబాబ్వేతో ఏకైక టెస్ట్ ముగించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నటువంటి భారత క్రికెటర్లు ఈ టోర్నీ ముగించుకొని ఇంగ్లాండ్ (England) కి బయలుదేరనున్నారు. భారత్ ఈ సారి పూర్తిగా యంగ్ స్టార్లతోనే బరిలోకి దిగుతుంది. ఇంగ్లాండ్ లాంటి పిచ్ లపై భారత యువజట్టుకి అతి పెద్ద సవాల్ గా మారనుంది. కనీసం ఇంగ్లాండ్ కి పోటీ అయినా ఇస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్లు రోహిత్ శర్మ (Rohith Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పడంతో భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ఎంపికయ్యారు. మరోవైపు బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు మాత్రం చాలా పటిష్టంగా కనిపిస్తోంది.


Also Read :  IPL 2025: ఏ జట్ల మధ్య క్వాలిఫైయర్, ఎలిమినేటర్… టైమింగ్స్, ఉచితంగా చూసే ఛాన్స్

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..? 

ఇండియా-ఇంగ్లాండ్ (IND Vs ENG)  జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ను టీవీలలో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ హక్కులను సొంతం చేసుకున్నటువంటి జియో హాట్ స్టార్.. టెస్ట్ సిరీస్ డిజిటల్ హక్కులను సైతం సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం.. 5 టెస్ట్ మ్యాచ్ లు కూడా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

ఇంగ్లాడ్-ఇండియా 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్ : 

1వ టెస్ట్ : జూన్ 20 నుంచి 24 వరకు : హెడ్డింగ్లీ, లీడ్స్.

2వ టెస్ట్ : జులై 2 నుంచి 6 వరకు : ఎడ్జ్ బాస్టన్, బర్మింగ్ హోమ్.

3వ టెస్ట్ : జులై 10 నుంచి 14 వరకు : లార్డ్స్, లండన్

4వ టెస్ట్ : జులై 23 నుంచి 27 వరకు : ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాపోర్డ్, మాంచెస్టర్.

5వ టెస్ట్ : జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు : కియా ఓవల్, లండన్.

భారత జట్టు ఇదే.. 

శుబ్ మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ ( వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కే.ఎల్. రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ,మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్. 

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×