Women’s Day 2025 : ఈరోజు ఉమెన్స్ డే. ఈ సందర్భంగా టాలీవుడ్ లో ఇప్పటిదాకా తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు, హీరో లేకుండానే బాక్స్ ఆఫీసును షేక్ చేసిన సినిమాలు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…
అరుంధతి (Arundhati)
లేడీ ఓరియెంటెడ్ సినిమా అనగానే టాలీవుడ్ లో ముందుగా గుర్తొచ్చే హీరోయిన్ అనుష్క శెట్టి. ఆమెను అలాంటి స్థానంలో నిలబెట్టింది మాత్రం దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ. 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్, అనుష్క శెట్టి, సోనూ సూద్ ల అద్భుతమైన యాక్టింగ్, బెస్ట్ విజువల్స్, స్క్రీన్ ప్లే ఈ మూవీకి మెయిన్ హైలెట్స్ అని చెప్పొచ్చు. ఈ మూవీ తర్వాతే అనుష్క కెరీర్ టర్న్ అయింది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఒసేయ్ రాములమ్మ (Osey Ramulamma)
ఇప్పుడంటే లేడీ ఓరియంటెడ్ సినిమా అనగానే అనుష్క, నయనతార పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇలా లేడి ఓరియంటెడ్ సినిమా అంటే విజయశాంతి పేరు గుర్తుకొచ్చేది. ఆమె రొమాంటిక్ సినిమాల నుంచి లేడీ ఓరియంటెడ్ సినిమాల దాకా అన్ని జానర్లలో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. అయితే 1990లో హీరో లేకుండానే హిట్ అయిన ఫస్ట్ మూవీగా చరిత్రను సృష్టించింది ‘ఒసేయ్ రాములమ్మ’. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ అద్భుతమైన సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. ఓ దళిత మహిళ తన కులం ఆధారంగా దొరల అఘాయిత్యానికి బలి కావడం, ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడం వంటి అంశంతో ఈ మూవీ నడుస్తుంది.
నయనతార (Nayanthara)
ఇక ఇప్పుడున్న హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఎంతమంది ఈ జానర్లో సినిమాలు చేసినా, లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను అందుకోగలగడం ఒక్క నయనతారకు మాత్రమే సొంతమైంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఆమె నటించిన ఒకటి రెండు సినిమాలు కాదు చాలా ఉన్నాయి. ఐరా, అనామిక, కర్తవ్యం, కోలమావు కోకిల, అన్నపూర్ణే వంటి సినిమాలు ఈ బ్యూటీని లేడీ సూపర్ స్టార్ గా నిలబెట్టాయి.
యశోద (Yashoda)
సమంత హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘యశోద’. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీకి హరి- హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సరోగసి నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
గార్గి (Gargi)
గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ‘గార్గి’ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. 2022లో రిలీజ్ అయిన ఈ డ్రామాలో కాళీ వెంకట్, ఆర్ఎస్ శివాజీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇందులో హీరోయిన్ తండ్రి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తన తండ్రి అలాంటివాడు కాదు అని నిరూపించడానికి హీరోయిన్ ఏం చేసింది అనేది స్టోరీ.