Singer Kalpana: సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం ఒక్కసారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసేలా చేసింది. ఇక ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది అని తెలియగానే వెంటనే తనను ఆసుపత్రికి తరలించారు. అప్పుడే పోలీసులు సైతం రంగంలోకి దిగి తన పరిస్థితి కూడా విచారణ చేయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా అసలు ఈ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలను కేపీహెచ్‌బీ పోలీసులు బయటపెట్టారు. ఒకప్పుడు సింగర్ కల్పన తన ఫ్యామిలీతో ఎర్నాకుళంలో నివాసముండేవారని తెలిపారు. ఇక ఆ తర్వాత గత 5 సంవత్సరాల నుండి నిజాంపేటలోనే వర్టెక్స్ ప్రివిలేజ్ అనే అపార్ట్మెంట్స్‌లో తన రెండో భర్తతో కలిసి ఉంటున్నారని అన్నారు.
నిద్రపట్టలేదు
మార్చి 3న కల్పన కూతురు అయిన దయ ప్రసాద్‌కు, కల్పనకు మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. ఎర్నాకుళంలో ఉంటున్న తన కూతురిని హైదరాబాద్‌కు వచ్చి చదువుకోమని చెప్పగా తను నిరాకరించింది. మార్చి 4న కల్పన ఏర్నాకుళం నుండి హైదరాబాద్‌కు బయల్దేరింది. తను ఇంటికి వచ్చేసరికి సుమారు మధ్యాహ్నం 1. 40 నిమిషాలు అయ్యింది. ఆపై ఎంత నిద్రపోవడానికి ప్రయత్నించినా నిద్రపట్టలేదని అందుకే దాదాపు 18 నిద్రమాత్రలు వేసుకున్నానని కల్పన తమకు స్వయంగా చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అలా ఎక్కువ నిద్ర మాత్రలు వేసుకోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో కల్పన భర్త ప్రసాద్ ఆమెకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నా ఆమె లిఫ్ట్ చేయలేదు.
వెంటనే పోలీసులకు సమాచారం
కల్పన కాల్స్ లిఫ్ట్ చేయట్లేదనే విషయాన్ని ఆ కాలనీ సభ్యులకు తెలియజేయడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. మొత్తానికి అందరూ కలిసి వెనక డోర్ నుండి ఇంట్లోకి ప్రవేశించి కల్పన ఉన్న పరిస్థితిని చూసి ఆసుపత్రికి తరలించారు. అయితే నిద్రపట్టకపోవడం వల్లే నిద్ర మాత్రలు వేసుకున్నానని, ఆత్మహత్య చేసుకోవడానికి కాదంటూ పోలీసులకు తెలిపారు కల్పన. ప్రస్తుతం ఆమె ప్రమాదం నుండి బయటపడి ఆరోగ్యంగానే ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి కల్పన.. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ బయటికి రావడంతో అసలు ఇదంతా నిజమేనా అన్న అనుమానం ప్రేక్షకుల్లో కూడా మొదలయ్యింది. అలా ఎలా తెలియకుండా అన్ని నిద్రమాత్రలు వేసుకుంటారని, వేసుకుంటే దాని వల్ల జరిగే పరిణామాలు ఏంటో కూడా ఆమెకు తెలిసే ఉంటుంది కదా అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Also Read: గతంలోనే ఆత్మహత్యాయత్నం.. ఆమె వల్లే బయటపడ్డ కల్పన.!
నిజం ఒప్పుకోవట్లేదా.?
ప్రస్తుతం కల్పన ఆత్మహత్యాయత్నం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. కల్పన ఆత్మహత్యాయత్నం చేసిందని, ఆసుపత్రిలో చేరిందని సమాచారం బయటికి రాగానే తనను నేరుగా కలవడానికి, తన ఆరోగ్యం పరిస్థితి గురించి తెలుసుకోవడానికి చాలామంది సినీ సెలబ్రిటీలు, సింగర్స్.. ఆసుపత్రికి వచ్చారు. అంతే కాకుండా తన కూతురు కూడా ఎర్నాకుళం నుండి వెంటనే హైదరాబాద్‌కు చేరుకుంది. కూతురితో జరిగిన గొడవ వల్ల, తన కూతురు తన దగ్గర ఉండడానికి ఒప్పుకోకపోవడం వల్లే కల్పన మనస్థాపానికి గురయ్యి ఇలా చేసి ఉంటుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ కల్పన మాత్రం తాను సూసైడ్ చేసుకుంది అనే వార్తలను పూర్తిగా కొట్టిపారేసింది.