Big Stories

Eiffel Tower With Matchsticks: 7 లక్షల అగ్గిపుల్లలతో ఈఫిల్..

Eiffel Tower Made With 7 lakh Matchsticks: అగ్గిపుల్లతో మంట రాజేయడమే కాదు.. అందమైన మోడళ్లకూ రూపునివ్వొచ్చు. ఫ్రాన్స్‌కు చెందిన 47 ఏళ్ల రిచర్డ్ ప్లాడ్ ఏకంగా ఈఫిల్ టవర్ మోడల్‌నే నిర్మించాడు.

- Advertisement -

ఈ మోడల్ తయారీకి ఆయనకు ఎన్ని అగ్గిపుల్లలు అవసరమయ్యాయో తెలుసా? 7 లక్షలకుపైనే. మొత్తం 4200 గంటల శ్రమించి 23.6 అడుగుల ఎత్తైన ఈఫిల్ టవర్‌ను 7,06,900 అగ్గిపుల్లలతో రూపొందించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డును బీట్ చేసేయగల ఈ టవర్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. లెబనాన్‌కు చెందిన మోడల్ మేకర్ తౌఫిక్ దహేర్ 2009లో 21.4 అడుగుల ఎత్తైన ఈఫిల్ టవర్‌ను తయారుచేసి గిన్నిస్‌లోకి ఎక్కాడు. 15 కిలోల బరువున్న అగ్గిపెట్టెలను కొనుగోలు చేసి మరీ రిచర్డ్ ప్లాడ్ ఈఫిల్ టవర్ మోడల్‌ను తయారు చేశాడు.

- Advertisement -

Read More: Pre Wedding Shoot In Hospital: ఇదేక్కడి ప్రీ వెడ్డింగ్ షూట్ రా బాబు.. ఎక్కడా సూడలే..

అగ్గిపులల చివర కొసలను ఓపిగ్గా కత్తిరించి మరీ టవర్‌ను నిర్మించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డులకు దరఖాస్తు చేయగా.. అది తిరస్కరణకు గురైంది. దీనిపై ప్లాడ్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాడు. 8 ఏళ్లుగా తాను పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరేనా? అని ఆవేదన చెందుతున్నాడు.

అయితే గిన్నిస్ రికార్డులకి ఎక్కడానికి ఎన్నో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మరోసారి ప్లాడ్‌ను సంప్రదిస్తామని, రికార్డుల సాధన కోసం నిబంధనలను పాటించారా? లేదా? అనే విషయాన్ని మరోసారి పరిశీలిస్తామని గిన్నిస్ నిర్వాహకులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News