Big Stories

Chilukuru Balaji Temple: భక్తులకు అలర్ట్.. గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేత!

Chilukuru Balaji Temple Garuda Prasadam(Latest news in hyd): చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. సంతాన భాగ్యం కోసం వచ్చిన చాలా మంది భక్తులకు గరుడ ప్రసాదం ఇచ్చామని.. ఈ క్రమంలోనే నేడు, రేపు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీని ఆపినట్లు వెల్లడించారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు మొదలైన తొలిరోజు, రెండో రోజు, మూడో రోజు కూడా ప్రసాదాన్ని పంపిణీ చేసేవారమని.. కానీ ఈ ఏడాది తొలిరోజునే భారీగా భక్తులు రావడంతో ప్రసాద వితరణ పూర్తయిందని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు గరుడప్రసాదం కూడా ఆలయానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

పిల్లలు లేనివారికి చిలుకూరు ఆలయంలో గరుడప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న భక్తులు.. నగర నలుమూలల నుంచి చిలుకూరుకు క్యూ కట్టారు. దీంతో 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అంచనాకు వెయ్యిరెట్లు అధికంగా భక్తులు రావడంతో.. పోలీసులు కూడా చేతులెత్తేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో.. మాసబ్ ట్యాంక్ నుంచి చిలుకూరు వరకూ వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు.

- Advertisement -

Also Read : ప్రసాదం ప్రభావం.. చిలుకూరులో భారీగా ట్రాఫిక్ జామ్

500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతిఏటా శ్రీరామనవమి మర్నాడు.. అంటే దశమి నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. గురువారం సెల్వకూత్తుతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. శుక్రవారం ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహించారు. నేడు గోపవాహన, హనుమంత సేవలు, 21న సూర్యప్రభ వాహనం, గరుడవాహన సేవలు జరుగుతాయి. శనివారం రాత్రి 10.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం, 22న వసంతోత్సవం, గజవాహన సేవలు, 23న పల్లకీసేవ, అదేరోజు రాత్రి 12 గంటలకు దివ్యరథోత్సవ కార్యక్రమం, 24న మహాభిషేకం, ఆస్థానసేవ, అశ్వవాహన సేవ, దోప్ సేవ, పుష్పాంజలి సేవలను నిర్వహిస్తారు. 25న చక్రతీర్థం, ధ్వజావరోహణం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News