Big Stories

Sunrisers Vs Delhi Capitals: హైదరా‘బాదుడు’.. మళ్లీ ఉంటుందా..?

Today IPL Match Sunrisers VS Delhi Capitals: ఐపీఎల్ 2024 సీజన్ లో.. హైదరాబాద్ సన్ రైజర్స్ ఏం చేస్తున్నారో తెలీదుగానీ ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు టీ 20 చరిత్రలో హయ్యస్ట్ స్కోరు చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది.

- Advertisement -

అలాంటి సన్ రైజర్స్ కి నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ రాత్రి 7.30కి ఢిల్లీ లో ప్రారంభం కానుంది.

- Advertisement -

ప్రస్తుతం పాయింట్ల టేబుల్ లో సన్ రైజర్స్ 4 వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి 4 గెలిచి, 2 పరాజయం పాలైంది. ఇక డిల్లీని చూస్తే 7 మ్యాచ్ లు ఆడి, 3 గెలిచి, 4 ఓడిపోయింది. పాయింట్ల టేబుల్ లో 6వ స్థానంలో ఉంది.

ఇక, ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 23 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ 12 సార్లు విజయం సాధిస్తే, ఢిల్లీ 11 సార్లు గెలిచింది.

మొన్నటి సీజన్ వరకు అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టుకి సరైన కెప్టెన్ రావడంతో ఆట తీరే మారిపోయింది. కమిన్స్ చక్కగా ఆడుతున్నాడు. ఆడిస్తున్నాడు. యువకుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్నాడు. వారికి అవకాశాలిచ్చి పరుగులు రాబడుతున్నాడు. బౌలింగులో తను కూడా రాణించి ప్రత్యర్థులు భారీ స్కోరు చేయకుండా కాపాడుతున్నాడు.

Also Read: చెలరేగిన రాహుల్.. సునాయాసంగా గెలిచిన లక్నో..

మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్ క్రమ్ లాంటివాళ్లు అదరగొడుతున్నారు. బౌలింగు విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ తప్ప అందరూ బాగానే బౌలింగ్ చేస్తున్నారు.

ఢిల్లీ విషయానికి వస్తే రిషబ్ పంత్ పాత ఫామ్ లోకి వచ్చేశాడు. అద్భుతమైన డైవింగులు చేసి క్యాచ్ లు పడుతున్నాడు. అలాగే పరుగులు కూడా చేస్తున్నాడు. డేవిడ్ వార్నర్ ఇంకా ఫామ్ లోకి రాలేదు. ప్రథ్వీ షా భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. మిగిలిన వాళ్లు అంతంత మాత్రంగా ఆడుతున్నారు. బౌలింగులో ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ బాగా బౌలింగ్ చేస్తున్నారు.

నేటి మ్యాచ్ లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడాలి మరి అని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News