
Yash:కూతురి పేరు అర్హతో అర్హ మీడియా సంస్థతో ఆహాను ప్రారంభించారు అల్లు అర్జున్. ఇప్పుడు ఆయన్ని ఫాలో అవుతున్నారు కేజీయఫ్ రాకీభాయ్ యష్. తన కుమార్తె ఐరా పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ని మొదలుపెట్టడానికి రెడీ అయ్యారు యష్. ఈ సినిమా సంస్థలో తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు యస్. తన 19వ సినిమా గురించి రీసెంట్గా చాలా విషయాలు మాట్లాడారు రాకీభాయ్.
యష్ మాట్లాడుతూ నేనెప్పుడూ సక్సెస్‌ని ఢంకా భజాయించి చెప్పాలనుకోను. నేను హ్యాపీగా ఉన్న విషయాన్ని అందరికీ డప్పు కొట్టి చెప్పక్కర్లేదు. రాజు జనాల్లోకి వెళ్లి నేను రాజును. నేను రాజును అని చెప్పుకోడు. అతను రాజు అనే విషయాన్ని జనాలే గుర్తిస్తారు. అలాగే ఆనందంగా ఉన్న వ్యక్తి జనాల్లోకి వెళ్లి నేను హ్యాపీగా ఉన్నాను. నేను సూపర్‌డూపర్‌గా ఉన్నాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జనాలకే అతను బావున్నాడనే విషయం తెలుస్తుంది. నేనూ అంతే. నేను బావున్నాననే విషయం నా అభిమానులకు తెలుస్తుంది. నేను కేజీయఫ్ సక్సెస్‌ని క్యాష్ చేసుకో దలచుకోలేదు. నేను పోరాట యోధుడిని. పోరాటం చేయడంలో నాకో కిక్కు ఉంటుంది. అలా పోరాడుతూ ప్రాణాలు వదలడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. అంతేగానీ, నాకు దేనితోనూ సంబంధం లేనట్టు, ఎప్పుడో వచ్చిన సక్సెస్‌ని పట్టుకుని వేలాడను
అని అన్నారు.
హోంబలే సంస్థలో వరుసగా కేజీయఫ్, కేజీయఫ్2 చేశారు యష్. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా ఏంటనేది అందరికీ ఆసక్తిగా మారింది. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ సలార్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కేజీయఫ్3 చేస్తారా? లేకుంటే, అంతలోనే యష్ మరో డైరక్టర్‌తో ఎవరితో అయినా మరో సినిమా ఏమైనా చేస్తారా? అనే డిస్కషన్ నెట్టింట్లో జరుగుతోంది. ఎవరితో సినిమా చేసినా, నెక్స్ట్ నుంచి తన ఓన్ ప్రొడక్షన్ హౌస్‌ని కూడా కలిపే సినిమా చేయడానికి నిర్ణయించుకున్నారట యష్.