E-Paper
Advertisement

Britain Companies : అంతటా కోతలు.. అక్కడ మాత్రం…

Britain Companies : అంతటా కోతలు.. అక్కడ మాత్రం…
Advertisement

Britain Companies : ఆదాయం తగ్గిపోవడం, ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా బడా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను భారీ సంఖ్యలో తగ్గించుకుంటున్నాయి. పని చేస్తాం బాబూ.. జీతం ఇవ్వండి చాలు అని మొత్తుకుంటున్నా… ఏ మాత్రం కనికరించకుండా, ఇళ్లకు సాగనంపుతున్నాయి. ఇప్పటిదాకా ఏకంగా లక్షన్నర మంది ఉద్యోగాలు ఊడిపోయాయని ఎన్నో నివేదికలు బయటపెట్టాయి. ప్రపంచమంతా పరిస్థితి ఇలా ఉంటే… ఒక్కచోట మాత్రం కంపెనీలు ఉద్యోగుల్ని కొత్త అల్లుళ్ల మాదిరి చూసుకుంటున్నాయి. తమ దగ్గర పని చేసినన్నాళ్లూ మహారాజుల్లా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో… అలాంటి కంపెనీల్లో ఉద్యోగం ఉండి ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటున్నారు… పింక్ స్లిప్పులు అందుకున్నవాళ్లంతా.

ఇప్పుడు బ్రిటన్లో ఏకంగా వంద కంపెనీలు… వారానికి 4 రోజుల పని విధానాన్ని ప్రకటించాయి. ఇది తాత్కాలికం కాదని… శాశ్వతంగా ఇదే పని విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించాయి. పైగా జీతంలో ఎలాంటి కోత కూడా విధించబోమని హామీ ఇచ్చాయి. కొత్త విధానం వల్ల తమ కంపెనీల్లో సరికొత్త మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. 4 రోజుల పని విధానాన్ని ప్రకటించిన కంపెనీల్లో మొత్తం 2,600 మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. బ్రిటన్లో ఇప్పుడు చాలా మంది 4 రోజుల పని విధానాన్ని సమర్థిస్తున్నారు. 5 రోజుల పని అనేది పాత కాలం ఆర్థిక వ్యవస్థకు చెందిన విధానమని… 4 రోజుల పని వల్ల కంపెనీల ఉత్పాదకత పెరగడంతో పాటు తక్కువ సమయంలోనే పని పూర్తవుతుందని వాదిస్తున్నారు.

Advertisement

బ్రిటన్లో కొన్ని కంపెనీలు చాలా కాలం నుంచే నాలుగు రోజుల పనివిధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతిభావంతుల్ని ఆకర్షించడానికి, వారితో ఎక్కువ కాలం పనిచేయించుకోడానికి ఇదో మార్గమని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. కొత్తగా 4 రోజుల పనిదినాలను అమలు చేస్తున్న పెద్ద కంపెనీల్లో ఆటమ్‌ బ్యాంక్‌, గ్లోబల్‌ మార్కెటింగ్‌ కంపెనీ అవిన్‌ ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఒక్కో దాంట్లో 450 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా తాము 4 రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నామని అవిన్‌ సంస్థ తెలిపింది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×