Devaki Nandana Vasudeva: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు, లెజెండ్రీ నటుడు కృష్ణ (Krishna )మనవడు అశోక్ గల్లా (Ashok Galla) మొదటి సినిమాతోనే నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అందుకున్నారు. రెగ్యులర్ గా కాకుండా మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకులను అలరించడానికి కొంచెం గ్యాప్ తీసుకున్న ఈయన ఇప్పుడు ‘దేవకీ నందన వాసుదేవా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత వర్మ (Prashanth Varma) కథ అందించారు.
విడుదల తేదీ వాయిదా..
ఇదిలా ఉండగా.. ఈ సినిమా అనుకున్న ప్లాన్ ప్రకారం నవంబర్ 14వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనుకోని కారణాలవల్ల వారం రోజుల పాటూ విడుదల వాయిదా పడింది. దీంతో ఫైనల్ గా దేవకీ నందన వాసుదేవా సినిమాను నవంబర్ 22వ తేదీన విడుదల చేయబోతున్నామంటూ పోస్టర్ తో సహా మేకర్స్ ప్రకటించారు. చివరిగా ‘గుణ 369’ సినిమాతో మంచి దర్శకుడిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అర్జున్ జంధ్యాల ఇప్పుడు మరో సక్సెస్ అందుకోవాలని ఆశపడుతున్నారు. ఈ చిత్రాన్ని సోమినేని బాలకృష్ణ. లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు నల్లపనేని యామిని సమర్పణలో వస్తున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా వేగంగా చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, గ్లింప్స్ కి కూడా మంచి స్పందన లభించింది.
కథ అందించిన ప్రశాంత వర్మ..
ఇకపోతే టైటిల్ తోనే సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన అశోక్ గల్లా.. ఇందులో మాస్ యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్నారు. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉంటాయని అర్థం అవుతుంది. ఇందులో వారణాసి మానస హీరోయిన్ గా నటిస్తోంది. సాయి మాధవ్ బుర్రా మాటలు అందించగా.. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. హనుమాన్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ ఈ సినిమాకి కథ అందించినప్పటికీ వెనుకడుగు వేశారు అంటే ఇక ఇందులో పస లేదా అనే కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ 14 న విడుదల కాబోయే చిత్రాలు..
వాస్తవానికి నవంబర్ 14వ తేదీన సూర్య ‘ కంగువ ‘చిత్రం విడుదల కాబోతోంది. పాన్ ఇండియా వైడ్ గా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఈ చిత్రంతో పాటు నవంబర్ 14న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘మట్కా’ సినిమా కూడా అదే రోజు రాబోతుంది. అందులో వరుణ్ తేజ్ లుక్ చాలా కొత్తగా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే నవంబర్ 15 న నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ మిస్టరీ ‘ లెవెన్ ‘ సినిమా కూడా రాబోతోంది. ఇక ఇన్ని చిత్రాలు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా వేశారు.
ఈ చిత్రాలతో పోటీ..
అయితే అదే రోజు విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాఖీ’ తో పాటు సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ‘జీబ్రా’ అలాగే ‘రోటీ కపడా రొమాన్స్’ అనే చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. మరి ఇన్ని సినిమాల మధ్య అశోక్ గల్లా ‘దేవకీ నందన వాసుదేవా’ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.