Kangana Ranaut: బాలీవుడ్‌లో నటిగా మాత్రమే కాకుండా ఈమధ్యే రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి సక్సెస్ సాధించింది కంగనా రనౌత్. తాజాగా కంగనా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన అమ్మమ్మ ఇంద్రానీ థాకూర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది కంగనా రనౌత్. తన అమ్మమ్మతో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంద్రానీ థాకూర్ మరణ వార్తను తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. చాలాకాలంగా ఇంద్రానీ ఆరోగ్యం బాలేదని, అదే సమయంలో తనకు ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మరణించిందని తెలిపింది కంగనా రనౌత్ (Kangana Ranaut).
దు:ఖంలో కుటుంబం
ముందుగా తన అమ్మమ్మ ఇంద్రానీ ఠాకూర్‌తో దిగిన ఒక హ్యాపీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కంగనా రనౌత్. దాంతో పాటు తన మరణ వార్త గురించి చెప్పుకొచ్చింది. ‘మా అమ్మమ్మ గత రాత్రి మరణించింది. మా కుటుంబమంతా దు:ఖంలో ఉంది. ప్లీజ్ తనను మీ ప్రార్థనల్లో ఉంచుకోండి’ అని వాపోయింది కంగనా రనౌత్. అలా ఇంద్రానీ ఠాకూర్ గురించి చెప్తూ వరుసగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు షేర్ చేసింది. ‘మా అమ్మమ్మ ఒక గుర్తుండిపోయే మహిళ. తనకు అయిదుగురు పిల్లలు. మా తాతయ్య సంపాదన అంతంత మాత్రమే. ఆయన కూడా తన పిల్లలకు ఉన్నత చదువులు అందించడానికి అమ్మమ్మ కష్టపడింది’ అని గుర్తుచేసుకుంది కంగనా.
Also Read: నేను వారిని సులువుగా నమ్మేశాను.. ఆ విషయం ఓపెన్‌గా చెప్పేసిన నయనతార
రుణపడి ఉంటాం
‘తన కూతుళ్లకు పెళ్లయినా కూడా వారికంటే సొంత కెరీర్ ఉండాలని ఆలోచించేది మా అమ్మమ్మ. అలా తన కూతుళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇది అప్పట్లో చాలా అరుదుగా జరిగేది. తన కొడుకులు, కూతుళ్లు అందరికీ సొంత కెరీర్లు ఉన్నాయి. తను ఎప్పుడూ తన పిల్లల కెరీర్ల విషయంలో చాలా గర్వపడుతూ ఉండేది. మేము నీకు చాలా రుణపడి ఉంటాము అమ్మమ్మ’ అని తెలిపింది కంగనా రనౌత్. దీంతో ఈ పోస్టులు చూసిన వారంతా కంగనాకు తన అమ్మమ్మే ఇన్‌స్పిరేషన్ అని, అలాంటి మనిషిని తను కోల్పోవడం చాలా బాధాకరం అని కామెంట్స్ చేస్తున్నారు.
నువ్వే మా ఇన్‌స్పిరేషన్
‘తన హైట్ 5 అడుగుల 8 అంగుళాలు. ఈ హైట్‌తో ఒక మహిళ ఉన్నత శిఖరాలు అధిరోహించడం మామూలు విషయం కాదు. నాకు కూడా తన హైటే వచ్చింది. దాంతో పాటు తన ఆరోగ్యం కూడా వచ్చింది. మా అమ్మమ్మ ఇప్పటికీ చాలా ఆరోగ్యంగానే ఉంది. తన వయసు 100 ఏళ్లు పైగా ఉన్నా కూడా ఇప్పటికీ తన పనులు తానే చేసుకునేది. కొన్నిరోజుల క్రితం తను తన రూమ్‌ను షేర్ చేసుకుంటున్నప్పుడు తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దానివల్లే తను మంచాన పడింది. తన కండీషన్‌లో ఆ బాధను వర్ణించడం చాలా కష్టం. తను తన జీవితాన్ని చాలా అద్భుతంగా జీవించి అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా మారింది. తను మా డీఎన్‌ఏలో ఎప్పటికీ ఉంటుంది’ అని వాపోయింది కంగనా రనౌత్.