Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ఏపీ ఎన్నికల్లో పోటీ చేసి ఘనవిజయాన్ని సాధించారు. దాంతో ఆయన ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పదవిని అధిరోహించారు. రాజకీయాల కన్నా ముందు ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలను అనౌన్స్ చేశారు. ఆ సినిమాల్లో రెండు సినిమాలు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని టాకీ పార్ట్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాయి. ఈ ఏడాది సమ్మర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ అలాగే హరిహర వీరమల్లు మూవీ రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి.. పవన్ కళ్యాణ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ప్రస్తుతం నిరాశ ఎదురైంది. అసలు మ్యాటర్ లోకి వెళ్తే..
హరిహర వీరమల్లు మూవీ..
పవన్ కళ్యాణ్ జ్యోతి కృష్ణ కాంబోలో వస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీకి ముందుగా క్రిష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. కొన్ని కారణాలవల్ల ఆయన సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి అయిన ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీకి పోటీ గట్టిగానే ఉందని తెలుస్తుంది. పవన్ మూవీ తో పాటు పోటీ పడుతున్న సినిమాలు ఏంటో ఓసారి చూసేద్దాం..
మార్చి 28 న రిలీజ్ కాబోతున్న సినిమాలు..
మార్చి 28 ను చాలా సినిమాలు లాక్ చేసుకున్నాయి. ఇందులో ముందుగా హరిహర వీరమల్లు సినిమాను ఈ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కి భక్తుడిని అని నితిన్ చెప్పుకుంటారు. అంతగా పవన్ ని అడ్మైర్ చేసే నితిన్, పవన్ కళ్యాణ్‌తో పోటీపడడానికి సిద్ధపడడం గమనార్హం.. ఇక ఈ రెండు చిత్రాలు ఒకే రోజున వస్తాయా? పవన్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉండడంతోనే నితిన్ తన సినిమాని ఈ తేదీకి విడుదల చేస్తున్నాడా? అన్నది చూడాల్సి ఉంది.. వీటితోపాటు విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12, మాడ్ స్క్వేర్ సినిమాలు కూడా తేదీని లాక్ చేసుకున్నాయి. ఈ సినిమాల మధ్య పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే కలెక్షన్స్ వస్తాయా అనే సందేహం కూడా ఫ్యాన్స్ కు కలుగుతుంది. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా థియేటర్లలోకి వస్తుంది ఏ సినిమా ఈ రేసుల నుంచి తప్పుకుంటుందో చూడాల్సి ఉంది..
ఇక మార్చి తర్వాత ఏప్రిల్ లో కూడా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నాయి.. అందులో చిరంజీవి నటించిన విశ్వంభరా, ప్రభాస్ నటించిన రాజాసాబ్, కన్నప్ప, తండేల్ సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటితో పాటుగా వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాలి..