Tollywood: మగపిల్లలు పుడితే తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పిస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ప్రతి తండ్రి ఒక్క వారసుడు అయినా ఉండాలని కోరుకుంటారు. కానీ, అదే మగపిల్లలు పెరిగి పెద్దయ్యాక ఆస్తుల తగాదాలతో తండ్రుల పరువును రోడ్డుకీడుస్తున్నారు. ఇది కేవలం సామాన్యుల ఇళ్లల్లోనే కాలేదు సెలబ్రిటీల ఇళ్లలో కూడా ఇదే జరుగుతుంది. ప్రస్తుతం మంచు మోహన్ బాబు ఇద్దరు బిడ్డలు ఆస్తి తగాదాలతో మోహన్ బాబు పరువును రోడ్డుకీడ్చారు.
ఇక దీనికన్నా ముందు మరో స్టార్ డైరెక్టర్ కొడుకులు కూడా ఇలాగే తండ్రి పరువును బజారుకీడ్చారు. ఆయన ఎవరో కాదు లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన దాసరి.. అనారోగ్యంతో 2017 లో మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక దాసరికి ఇద్దరు కొడుకులు దాసరి అరుణ్, దాసరి ప్రభు. అరుణ్ ను హీరోగా పరిచయం చేశారు దాసరి. కానీ,అతనికి ఆశించిన విజయం దక్కలేదు . దీంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు.
ఇక తండ్రి చనిపోయేవరకు సైలెంట్ గా ఉన్న ఈ ఇద్దరు అన్నదమ్ములు.. ఆ తరువాత ఆస్తి తగాదాల్లో రోడ్డున పడ్డారు. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సమస్యలను పరిష్కరించిన దాసరి కుటుంబంలోనే ఇలాంటి ఆస్తితగాదాలు తలెత్తడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అన్న ప్రభు ఉంటున్న ఇంటిపై అరుణ్ కన్నేశాడు. అది దాసరి.. ప్రభు కూతురు పేరున రాసాడు. అందుకు సంబంధించిన వీలునామా కూడా ఉంది. అయితే అందులో కూడా తనకు వాటా ఉందని అరుణ్ గొడవకు దిగాడు.
Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశ తప్పదా?
ఒకరోజు అర్ధరాత్రి అన్న ఇంట్లోకి చొరబడి గొడవకు దిగాడు. ఇక అప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అయిన మోహన్ బాబు, మురళీ మోహన్ తదితరులు జోక్యం చేసుకొని ఆ గొడవను సద్దుమణిగించారు. ఇండస్ట్రీ మొత్తానికి పెద్దగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దాసరి పరువు మొత్తాన్ని కొడుకులు తీసేశారు. ఇక ఆ ఇద్దరు అన్నదమ్ముల గొడవను పరిష్కరించిన మోహన్ బాబు ఇంట్లోనే ఇప్పుడు ఈ ఆస్తి తగాదాలు చెలరేగాయి. మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు.. చిన్న కొడుకు మనోజ్ పై దాడికి పాల్పడ్డాడు. దానికి మోహన్ బాబు కూడా సపోర్ట్ చేశాడు.
ఇక ఈరోజు తన ఆస్తులను తన పేరు మీద రాయాలని కోర్టు ను ఆశ్రయించాడు. మోహన్ బాబుకు ఇద్దరు కొడుకులు. మంచు విష్ణు, మంచు మనోజ్. పెళ్లిళ్లు అవ్వకముందు వరకు కలిసి ఉన్న ఈ అన్నదమ్ములు పెళ్లిళ్లు అయ్యాకా గొడవలు పడడం స్టార్ట్ చేశారు. మోహన్ బాబు ఆస్తి విషయంలో మనోజ్ కు అన్యాయం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మనోజ్.. రోడ్డెక్కాడు. తండ్రిపై పోలీస్ కేస్ పెట్టాడు. అలా ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ నేపథ్యంలోనే సొంత తమ్ముడిని చంపడానికి ప్లాన్ చేశాడు విష్ణు.
ఇక మీడియా ముందే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టుకుంటూ కొట్టుకుంటున్నారు. మనోజ్ ను కుక్క అని విష్ణు.. నేనుకాదురా నువ్వే కుక్క అని మనోజ్ ట్వీట్స్ ఫైట్ చేస్తున్నారు. ఇక వీరి గొడవలపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని తేల్చుకుంటే సరిపోతుందిగా అని కొందరు అంటుండగా.. ఇంకొందరు ఆస్తుల కోసం తండ్రుల పరువు తీస్తున్న కొడుకులు.. అప్పట్లో దాసరి కొడుకులు కూడా అంతే అని గుర్తుచేసుకుంటున్నారు. పున్నామ నరకం నుంచి కాపాడతారు అనుకున్న కొడుకులే బతికి ఉండగానే నరకం చూపిస్తున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు.