మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి తర్వాత ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు .. ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ పార్టీపై పట్టు కోసం బావబామ్మరుదుల మధ్య ఫైట్ నడుస్తున్నట్లు కనిపించింది.. ఇంతలో కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఇరుక్కున్నారు… దాంతో లిక్కర్ స్కాం కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన కవిత యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు… ప్రభుత్వంపై పోరాటాలు, పరామర్శలు అంటూ అన్నా చెల్లెల్లు హడావుడి చేస్తున్నారు… అలా ఆ ఫ్యామిలీలో ఎవరి పాలిటిక్స్ వారు చేస్తుంటే.. వారు అప్రోచ్ అవుతున్న విధానమే విమర్శలు మూట గట్టుకుంటూ కామెడీగా తయారైంది.
చనిపోయిన వారి కుటుంబాల పరామర్శకు వెళ్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్టెప్పులు వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నెలల తరబడి జైలు జీవితం తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన కవిత మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. సర్కార్ వైఫల్యాలపై సమరమంటూ ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టారు. జైనూర్ మండలం దేవునిగూడలో లైంగిక దాడికి గురైనా గిరిజన మహిళను పరామర్శించారు. అనంతరం వాంకిడి మండలం డాబా గ్రామంలో హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చనిపోయిన విద్యార్థి శైలజ కుటుంబాన్ని పరామర్శించారు.
అసలు అధికారంలో ఉన్నంత కాలం కవిత ఏనాడూ ఆదిలాబాద్ గడప తొక్కలేదంట.. ఇప్పుడు బీఅర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్ కూమార్తెగా జిల్లాలో అడుగు పెడుతుండటంతో గులాబీ దళం కదిలి వస్తుందని ఆశించిన ఆమెకు పార్టీ కేడరే షాక్ ఇచ్చింది.. పరమార్శ యాత్రకు వందల మంది వస్తారని ఊహిస్తే.. కొద్ది మంది చోటమోట నాయకులు తప్పితే….కార్యకర్తలు పెద్దగా కదిలి రాలేదు .. సరే ఎలాగూ వచ్చాం కదా ఏదో ఒకటి చేయాలనుకున్నారేమో.. పరామర్శకని వెళ్లి ఆమె గిరిజనులతో కలిసి డ్యాన్స్ వేసి రావడం విడ్డూరంగా విడ్డూరంగా మారింది… ఆ క్రమంలో ఆమె అనవసరంగా వచ్చి పరామర్శ యాత్ర పేరుతో పార్టీ పరువు మరింత దిగజార్చారని బీఅర్ఎస్ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట.
ఇక చెల్లి కంటే తాను తక్కువ తినలేదననట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి ఏసీబీ, ఈడీ కేసులో ఇరుక్కున్నారు .. తనపై కేసులు కొట్టేయాలని ఆయన వేసిన క్యాష్ పిటీషన్లను కోర్టులు కొట్టేశాయి.. ఇప్పటికే ఆయన విచారణలు కూడా ఎదుర్కొంటున్నారు.. ఏసీబీ ఒక రౌండ్ 8 గంటల పాటు విచారించింది… ఈడీ కూడా నోటీసులిచ్చి 7 గంటలు ఎంక్వైరీ చేసింది.
దర్యాప్తు సంస్థల విచారణకు హాజరవుతున్న పతిసారి కేటీఆర్ నానా హడావుడి చేస్తున్నారు.. లాయర్‌ని అనుమతించలేదని ఒకసారి ఏసీబీ విచారణకు డుమ్మా కొట్టారు.. విచారణకు సహకరించాలి కోర్టు ఇచ్చిన ఆదేశాలతో తాజాగా ఈడీ విచారణకు వచ్చిన సందర్భంగా బలప్రదర్శనతో నానా హడావుడి చేశారు. తానేం తప్పు చేయలేదని చెప్పుకుంటున్న కేటీఆర్ విచారణకు సైలెంట్‌గా వచ్చి వెళ్ల వచ్చు .. అయితే ప్రతిసారి అరెస్ట్ భయంతోనే ఆయన హడావుడి చేయిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అరెస్ట్ భయంతోనే మందిని ఉసిగొల్పుతున్నారన్న టాక్ బీఆర్ఎస్‌లోనే వినిపిస్తుంది.
Also Read: మంత్రి టు డమ్మీ.. జగదీష్ కథ క్లోజ్!
డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలావాటైనట్లు తాజాగా జనం దృష్టి మళ్లించడానికి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో రైతు దీక్షకు అటెండ్ అయ్యారు … కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నా.. కేటీఆర్‌కి కనిపించడం లేదంట.. మరి ఆయన లెక్కలేంటో కాని షాబాద్ వెళ్లేటప్పుడు ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లు భారీ ర్యాలీ.. ప్రొక్లేయనర్లతో పూల వర్షాలు… అధికారంలోకి వచ్చినట్లు అభివాదాలు. అందుకే.. పాపం గజమాలలు ఒక్కటే తక్కువయ్యాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. రైతు దీక్షకని వెళ్తూ ఆయన చేయించుకున్న హడావుడి చూస్తూ జనం విస్తూ పోవాల్సి వచ్చిందంట. నిఘా సంస్థల విచారణలకు వెళ్తున్నా అదే హడావుడి.. సరే అప్పుడంటే అరెస్ట్ భయంతో చేయించుకున్నారని అనుకుంటే… రైతు దీక్షకి కూడా లక్షలు తగలేయడం ఏంటని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మొత్తానికి అన్నాచెల్లెల్ల పరామర్శలు, పోరాటాలు భలే తయారయ్యాయని.. ఏం చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీకే చెల్లుబాటు అవుతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.