BigTV English

Young Heroine: ఒక్క అవకాశం కోసం 5 మంది.. భరించలేకపోయా..?

Young Heroine: ఒక్క అవకాశం కోసం 5 మంది.. భరించలేకపోయా..?

Young Heroine.. సాధారణంగా పని ప్రదేశాలలో మహిళలు లైంగిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ప్రపంచం.. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న నేపథ్యంలో.. సినిమా ఇండస్ట్రీకి చెందిన మహిళలు ఇలా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని చెబితే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత.. అక్కడ చాలామంది ఆడవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని, అవకాశాల పేరిట అత్యాచారానికి కూడా గురవుతున్నారు అంటూ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి..


 

దీంతో పలువురు సెలబ్రిటీలు తమ సినిమా ఇండస్ట్రీలలో కూడా జస్టిస్ హేమా కమిటీ లాంటి నివేదిక వేయాలి అంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. అంతేకాదు ఒక్కొక్కరిగా తమ కెరియర్ లో తాము ఎదుర్కొన్న లైంగిక ఇబ్బందుల గురించి కూడా నిర్భయంగా బయటకి చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక మలయాళ బ్యూటీ తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు మలయాళ యంగ్ బ్యూటీ శృతి హరిహరన్ (Shruti Hariharan). కేరళకు చెందిన 2012లో విడుదలైన మలయాళ చిత్రం సినిమా కంపెనీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.


అర్జున్ సర్జా పై కంప్లైంట్..

ఆ తర్వాత దయోతిరి, సావరీ 2, లూసియా వంటి కన్నడ చిత్రాలలో కూడా నటించింది. అంతేకాదు తమిళంలో నిల, నెరుంగి వా ముత్త మీదతే వంటి సినిమాలలో నటించిన ఈమె ప్రముఖ హీరో అర్జున్ సర్జా పై కేస్ పెట్టింది. తనను కౌగిలించుకున్నాడనే వివాదానికి తెరలేపింది. దీనిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా.. అర్జన్ సర్జ (Arjun sarja)పై చేసిన ఫిర్యాదుకు సరైన సాక్షాదారాలు లేకపోవడంతో కోర్టు ఈ కేసును కొట్టి పారేసింది. ఇప్పుడేమో ఏకంగా 5 మంది తమిళ నిర్మాతలు తన కోసం వల విసిరారని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.

క్యాస్టింగ్ కౌచ్ పై శృతి షాకింగ్ కామెంట్స్..

2018లో శృతి చేసిన కామెంట్లు జస్టిస్ హేమా కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. శృతి గతంలో మాట్లాడుతూ.. తమిళ నిర్మాత ఒకరు నన్ను లైంగికంగా లొంగ తీసుకోవడానికి కమిట్మెంట్ అడిగాడు. ముఖ్యంగా ఆ సినిమాకు ఐదుగురు నిర్మాతలు కాబట్టి.. ఐదుగురికి కూడా కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారు.. దానితో నేను అభ్యంతరం వ్యక్తం చేశాను ఫలితంగా నాకు తమిళ్ నుంచి మంచి సినిమాలలో అవకాశాలు రాలేదు అంటూ ఆమె తెలిపింది.

అవకాశం కోసం 5 మంది నిర్మాతలు కమిట్మెంట్ అడిగారు..

అలాగే ఆమె మాట్లాడుతూ.. నేను నటించిన తొలి కన్నడ సినిమాకి జరిగిన సమావేశం నన్ను మరింత భయపెట్టింది. నా వయసు అప్పుడు 18 సంవత్సరాలు మాత్రమే. కాస్టింగ్ కౌచ్ షాక్ తో నేను విపరీతంగా భయపడిపోయాను. ఈ విషయాన్ని నా డాన్స్ కొరియోగ్రాఫర్ కి చెబితే.. ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే దాని గురించి ఆలోచించడం వదిలేయండి అని చెప్పారు. అయితే సరిగ్గా ఈ ఘటన జరిగిన నాలుగేళ్లకు ఇదే సినిమా హక్కులను తమిళ్ ఇండస్ట్రీ వారు తీసుకున్నారు.. అందులో కూడా నాకు సేమ్ పాత్ర ఇస్తానని చెప్పారు. అయితే ఆ సినిమాకు ఐదుగురు నిర్మాతలు కావడంతో.. వారు కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారు. ఆ సమయంలో నేను ఏం చెప్పాలో తెలియక నా చేతిలో చెప్పులు లేవు అంటూ గట్టిగా అరిచి అక్కడి నుంచి వచ్చేసాను. ఫలితంగా నాకు తమిళ్ నుంచి సినిమా అవకాశాలు రాలేదు అంటూ చెప్పుకొచ్చింది శృతి హరిహరన్. ప్రస్తుతం శృతి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×