BigTV English

HBD Aishwarya Rajesh: తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

HBD Aishwarya Rajesh: తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh).. పేరుకే తెలుగు హీరోయిన్.. కానీ తెలుగులో ఈమె టాలెంట్ ను గుర్తించకపోవడంతో కోలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. నటన ప్రతిభ ఉంటే చాలు కలర్ తో పనిలేదని నిరూపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ వెంకటేష్ భార్యగా నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. సంక్రాంతి రేసులో జనవరి 14వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. పైగా ఈరోజు ఈమె పుట్టినరోజు కూడా.. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఆమె ఆస్తులు విలువ కూడా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.


ఐశ్వర్య రాజేష్ ప్రారంభ జీవితం..

ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు ప్రముఖ దివంగత నటుడు రాజేష్ (Rajesh)కుమార్తె. ఈయన తెలుగులో 54 చిత్రాలలో నటించారు. అంతేకాదు ఈయన సోదరి శ్రీలక్ష్మి (Srilakshmi) దాదాపు 500కు పైగా చిత్రాలలో నటించింది.. ఇక వీరి వారసురాలి గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలోకి రాకముందు యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్, చెన్నై లో బీకాం పూర్తి చేసిన ఈమె, మొదట మోడల్ గా కెరియర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత టీవీలో, రియాల్టీ షోలకు హోస్టుగా కూడా వ్యవహరించింది. ఇక తర్వాత 1995లో చైల్డ్ ఆర్టిస్టుగా ‘రాంబంటు’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె, ఆ తర్వాత 2010లో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది..


ఐశ్వర్య రాజేష్ ఆస్తుల విలువ..

ఇక ఐశ్వర్య రాజేష్ ఆస్తుల విలువ సుమారుగా రూ.30 కోట్ల పై మాటే అని సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న ఈమె, పలు యాడ్స్ లో కూడా నటిస్తోంది.అటు ప్రైవేటు కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈమె.. వీటి ద్వారా సంవత్సరానికి రూ. 25 లక్షల వరకు సంపాదిస్తుందని సమాచారం. ఇక ఏడాదికి రెండు సినిమాల చొప్పున దాదాపు రూ.4కోట్ల వరకు సంపాదిస్తోందట ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె దగ్గర ఉన్న కార్ల విషయానికి వస్తే.. వోల్వో ఎక్స్ సి 90 , బీఎండబ్ల్యూ 5 సిరీస్ తోపాటు మరికొన్ని ఖరీదైన లగ్జరీ కార్లు ఈమె సొంతం.

ఐశ్వర్య రాజేష్ కుటుంబ నేపథ్యం..

కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఐశ్వర్య తన సోదరుడు, తల్లితో జీవిస్తోంది. ఇటీవల సోదరుడికి కూడా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని ఈమె పెళ్లి ఎప్పుడు అని అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా.. పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలలో నటించడానికి అవకాశం ఇచ్చే వాడే తన భర్తగా రావాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపింది .అయితే ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, అందుకే సాధ్యమైనంత వరకు అవకాశాలు అందుకుని సక్సెస్ కావాలని చూస్తున్నాను అని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×