BigTV English

L&T Chairman Workweek : వారంలో 90 గంటలు వర్క్ చెయ్యాలన్న ఎల్ అండ్ టీ చైర్మన్.. నటి దీపికా పదుకోనె ఫైర్

L&T Chairman Workweek : వారంలో 90 గంటలు వర్క్ చెయ్యాలన్న ఎల్ అండ్ టీ చైర్మన్.. నటి దీపికా పదుకోనె ఫైర్

L&T Chairman Workweek Deepika Padukone | ఇటీవలి కాలంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మెంటల్ హెల్త్ గురించి తెగ చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే ఇన్‌ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి ఇటీవలే ప్రతి ఒక్కరూ వారానికి 70 గంటలు పనిచేయాలంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద రగడ జరుగుతుండగానే.. మరో ఎంఎన్సీ కంపెనీ చైర్మన్ ఇంకో అడుగు ముందుకేసి ఇంకో షాకింగ్ కామెంట్ చేశారు.


ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ ఎల్ అండ్ టీ (లార్సన్ అండ్ టబ్రో) ఛైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తమ కంపెనీకి సంబంధించిన ఒక మీటింగ్‌లో సుబ్రహ్మణ్యన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పని, సెలవుల గురించి మాట్లాడిన ఆయన.. తన ఉద్యోగులను ఆదివారాల్లో కూడా పనులు చేయించాలని అనుకుంటున్నానని, కానీ అది కుదరడం లేదని అనడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

ఈ మీటింగ్‌కు సంబంధించిన ఒక వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. దానిలో ఆయన మాట్లాడుతూ. ‘మిమ్మల్ని ఆదివారాలు కూడా పని చేయించలేకపోతున్నందుకు నేను చాలా బాధపడతా. మిమ్మల్ని ఆదివారాల్లో పని చేయించగలిగితే చాలా సంతోషించేవాడిని. నేను కూడా ఆదివారాలు వర్క్ చేస్తాను కదా. సో, మీరు కూడా చేస్తే చాలా సంతోషించేవాడిని’ అని చెప్పారు. అసలు సెలవు తీసుకొని, ఉద్యోగులు ఇంట్లో ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు.


‘అసలు ఇంట్లో కూర్చొని మీరేం చేస్తారు? భార్యను చూస్తూ మీరెంత సేపు ఉంటారు? మిమ్మల్ని చూస్తూ మీ భార్య ఎంత సేపుంటుంది? ఆ టైంలో ఆఫీసుకు వచ్చి పని చెయ్యండి’ అని సుబ్రహ్మణ్యన్ అన్నారు. అక్కడితో ఆగకుండా ఒక చైనా వ్యక్తితో తన సంభాషణను గుర్తుచేసుకున్నారు. ‘నేను ఒక చైనా వ్యక్తితో మాట్లాడినప్పుడు.. మేం త్వరలోనే అమెరికాను దాటేస్తామని అతను అన్నాడు. అదెలా? అని అడిగితే.. మా దేశంలో వర్క్ ఎథిక్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. మేం వారంలో 90 గంటలు పనిచేస్తాం. అమెరికా వాళ్లు జస్ట్ 50 గంటలే పని చేస్తారు. అందుకే మేం వాళ్లను త్వరలోనే దాటేస్తాం అని చెప్పాడు’ అని సుబ్రహ్మణ్యన్ చెప్పుకొచ్చారు.

Also Read: 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా.. ఈ ఆధ్యాత్మిక సంగమం విశిష్టత తెలుసా?..

తన కంపెనీ ఉద్యోగులు కూడా చైనా వాళ్లలా పనిచెయ్యాలని ఆయన చెప్పారు. దీనిపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతుండగా.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ కూడా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఇలాంటి ఉన్నత స్థాయుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా షాకింగ్. మెంటల్ హెల్త్ కూడా ముఖ్యమే’ అని ఆమె తన ఇన్‌స్టాగ్రాం పోస్టులో రాసుకొచ్చారు. ఇప్పుడు నెట్టింట అందరూ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమని కామెంట్స్ చేస్తున్నారు.

దీనిపై ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. ‘నేను ఆ మీటింగ్‌లో గంటసేపు కూర్చొని ఆయన చెప్పేదంతా విన్నా. ఇలాంటి మాటలు వస్తున్నాయంటే దానికి నిజంగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తే కారణం. ఆయన 70 గంటలు అన్న తర్వాతే వీళ్లు ఇలా అంటున్నారు’ అని చెప్పాడు. అలాగే ఎల్ అండ్ టీలో ఉద్యోగస్తులను చాలా దారుణంగా ట్రీట్ చేస్తారని, సరిగా సెలవులు కూడా ఇవ్వరని అన్నాడు. ఈ కారణంతోనే కంపెనీలో జాయిన్ అయిన రెండు, మూడేళ్లలోనే అందరూ మానేస్తారని చెప్పుకొచ్చాడు.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×