సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది నటీనటులు క్యాన్సర్ బారిన పడి, దాని నుండి ధైర్యంగా కోలుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో సీనియర్ నటీమణులు అయినటువంటి మనీషా కొయిరాలా(Manisha Koirala), మమతా మోహన్ దాస్ (Mamta mohan das),సోనాలి బింద్రే (Sonali Bendre), నటి గౌతమి (Gauthami) వంటి ఎంతో మంది హీరోయిన్లు ఈ క్యాన్సర్ మహమ్మారి బారిన పడి, దాని నుండి ధైర్యంగా కోలుకొని, మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే హీరోయిన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన స్టార్ హీరోలైన రిషి కపూర్(Rishi kapoor), రాజేష్ ఖన్నా(Rajesh Khanna) వంటి హీరోలు కూడా ఈ క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు వదిలారు.అలా కొంతమంది ధైర్యంగా ఈ మహమ్మారి నుండి బయటపడితే, మరికొంతమంది ఈ మహమ్మారికి బలవుతున్నారు. ఇక ఈ మహమ్మారి బారిన మరో నటి పడింది.అయితే క్యాన్సర్ బారిన పడిన చాలామందికి.. మిగతావాళ్లు తమకు తోచిన సహాయం చేయడంతో పాటు వారిపై మానవత్వంతో జాలి చూపిస్తారు. కానీ ఈ హీరోయిన్ పై మాత్రం జాలి చూపించకపోగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ నటి ఎవరో కాదు బాలీవుడ్ బుల్లితెర నటి చవీ మిట్టల్ (Chhavi Mittal) ..
క్యాన్సర్ బారినపడ్డ యంగ్ బ్యూటీ..
బాలీవుడ్లో పలు సీరియల్స్ అలాగే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న చవీ మిట్టల్ తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ సోషల్ మీడియా జనాలకు మాత్రం ఈమె సుపరిచితమే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా చేస్తున్న చవీ మిట్టల్ క్యాన్సర్ బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె క్యాన్సర్ బారిన పడి మూడు సంవత్సరాలు అవుతుందట. పది సంవత్సరాల వరకు క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలని తెలిపారట డాక్టర్లు. అయితే చవీ మిట్టల్ కి రొమ్ము క్యాన్సర్ రావడంతో ఈమెకి వచ్చిన పరిస్థితి చూసి జాలిపడ పోగా మానవత్వం లేని మనుషుల్లాగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో ఈమె పై నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారట. అయితే ఆ ట్రోల్స్ అన్ని చూసి తెగ బాధపడిపోతుంది చవీ మిట్టల్.అయితే తనపై ట్రోల్స్ చేస్తున్న చాలామంది పోస్ట్ చేసిన కామెంట్లను స్క్రీన్ షార్ట్ చేసి పోస్ట్ చేస్తూ బాధపడింది చవీ మిట్టల్. ఈ నటి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది.. “నేను 2022లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డాను. దీని నుండి కోలుకోవాలంటే 10 సంవత్సరాలు చికిత్స తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు.ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. స్కిన్ డ్రైగా మారిపోవడం,జుట్టు అంతా రాలిపోవడం, డిహైడ్రేషన్ అవ్వడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ నేను చూస్తున్నాను.ఈ ఏడాది ఏప్రిల్ కి నేను హార్మోన్స్ చికిత్స తీసుకొని మూడేళ్లు అవుతుంది.
ట్రోల్స్ పై ఆవేదన వ్యక్తం చేస్తున్న నటి..
అయితే క్యాన్సర్ తో పోరాడుతున్న నాపై ట్రోల్ చేసే వారిని చూస్తే మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తుంది. నేను క్యాన్సర్ తో ఇంతలా పోరాడుతుంటే వాళ్ళు మాత్రం చాలా నీచంగా కామెంట్లు చేస్తున్నారు. నేను బ్రెస్ట్ క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నాను.. ఆడవాళ్ళకి జుట్టు అంటే ఎంత ప్రేమ ఉంటుందో చెప్పనక్కర్లేదు. కానీ ఈ క్యాన్సర్ బారినపడి నేను ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది.కానీ ఈ టైంలో నన్ను ట్రోల్స్ చేస్తుంటే చాలా బాధేస్తోంది. మీ నెగటివ్ కామెంట్లు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్లు పెట్టడానికి ఓ కారణం ఉంది. ఎంతోమంది నాకు సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం నాపై నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. క్యాన్సర్ తో పోరాడుతున్న నాలాంటి వారిపై ఇలా నెగిటివ్ ట్రోల్స్ చేయడానికి మీకు మనసెలా వచ్చిందో నాకు అర్థం అవ్వడం లేదు. మిమ్మల్ని చూస్తుంటే మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తుంది. నేను బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతూ జుట్టు అంతా పోగొట్టుకున్నాను. దానిపై చాలామంది ట్రోల్ చేస్తున్నారు. కానీ నన్ను ట్రోల్ చేసిన వారందరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా క్యాన్సర్ బారిన పడకుండా తల నిండా జుట్టుతో ఉండాలని నేను ఆ దేవున్ని కోరుకుంటాను. నాలా మీరు కాకుండా ట్రోల్ ఫ్రీ లైఫ్ ని గడపాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంత పెద్ద మహమ్మారి బారిన పడ్డా కూడా ఆత్మవిశ్వాసం ఎక్కడా కూడా కోల్పోకుండా నా బాడీని ఎంత ఫిట్ గా ఉంచానో మీరు చూడండి” అంటూ ఒక పోస్ట్ పెట్టింది.ప్రస్తుతం చవి మిట్టల్ పెట్టిన పోస్ట్ చూసి చాలా మంది ఆమెకు మద్దతుగా కామెంట్లు పెడుతూ క్యాన్సర్ తో పోరాడుతున్న చవి పై నెగటివ్ కామెంట్లు పెడుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.