Phone tapping case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితులను అమెరికా నుంచి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా రేపో మాపో కీలక నిందితులు రాబోతున్నారు.
ఇదిలావుండగా ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు అధికారులు. నవంబర్ 2023 నుంచి దాదాపు 15 రోజుల పాటు ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనా రెడ్డి పీఏను అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ గుట్టు బయటపడింది. దీంతో అమెరికా నుంచి నిందితులు రావడం మరింత తేలిక అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. వాళ్లు వస్తే ఈ కేసు కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తింపు
నవంబర్ 2023 లో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఫోన్ ట్యాపింగ్
దర్యాప్తులో ఇంద్రసేనా రెడ్డి PA ను విచారించిన అధికారులు
విచారణలో బయటపడ్డ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం pic.twitter.com/ySKG0dX467
— BIG TV Breaking News (@bigtvtelugu) January 25, 2025