Indian Railways: భారతీయ రైల్వే లో మరో కీలక ముందడుగు పడింది. అత్యంత వేగంతో ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చే హైపర్ లూప్ వ్యవస్థ రూపొందుతోంది. ప్రపంచంలోనే అతి పొడవైన హైపర్ టూప్ ట్యాబ్ గా గుర్తింపు తెచ్చుకోబోతోంది. దీని పొడవు సుమారు 410 మీటర్లుగా ఉండబోతోంది. తాజాగా హైపర్ టూప్ ట్యూబ్ పాడ్ మోడల్ ను ఆవిష్కరించారు. తాజాగా ఈ వీడియోను అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
హైపర్ లూప్ ట్యూబ్ ను పరిశీలించిన అశ్విని వైష్ణవ్
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఐఐటీ మద్రాస్ లోని హైపర్ లూప్ ట్రాప్ టెస్టింగ్ సెంటలర్ ను సందర్శించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ సహాయంతో రూపొందిస్తున్న హైపర్ లూప్ ట్యూబ్ పరిశీలించారు. పాడ్ పని తీరు గురించి పరిశోధకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైపర్ లూప్ ట్యూబ్ పై ప్రశంసలు గుప్పించారు. ప్రపంచం లోనే అతి పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ ను భారత్ రూపొందిస్తోందని వెల్లడించింది. దీని పొడవు ఏకంగా 410 మీటర్లు ఉంటుందన్నారు. మున్ముందు మరో 40 మీటర్లు పొడగించనున్నట్లు వెల్లడించారు. హైపర్ లూప్ రవాణా కోసం పూర్తి స్వదేశీ టెక్నాలజీతో దీనిని రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న హైపర్ లూప్ వ్యవస్థ ఇప్పటి వరకు అన్ని పరీక్షల్లో సక్సెస్ అయినట్లు వెల్లడించారు. భారత్ లో త్వరలోనే ఈ రవాణా అందుబాటులోకి రాబోతుందన్నారు.
Longest Hyperloop tube in Asia (410 m)… soon to be the world’s longest.@iitmadras pic.twitter.com/kYknzfO38l
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 16, 2025
గంటకు 700 నుంచి 1000 కిలో మీటర్ల వేగం
హైపర్ టూప్ టెస్ట్ ట్రాక్ ను రైల్వేశాఖ సాయంతో మద్రాస్ ఐఐటీ డెవలప్ చేసింది. ఈ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే, గంటలకు 700 నుంచి 1000 కిలో మీటర్ల దూరాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. హైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేకమైన నిర్మాణం. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. ఇందులో గాలి ఉండదు. వాక్యూం మీద ఎలాంటి ఏరో డైనమిక్ ప్రభావం పడదు. ఏ విధమైన ఒత్తిడి రైలు మీద, దాని వేగం మీద ప్రభావం చూపించదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీతో నడిచే రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. వీటిలో రైలు బోగీలను పోలిన పాడ్స్ ఉంటాయి.
యువ పరిశోధకులపై ప్రశంసలు
ఇక ఈ అద్భుతమైన హైపర్ లూప్ ట్యూబ్ ను రూపొందించడంలో భావస్వాములైన యువ పరిశోధకులను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు. ఇకపై ఈ హైపర్ లూప్ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీని ఐసిఎఫ్ చెన్నైలో అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఐసిఎఫ్ లో అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు వందే భారత్ హై స్పీడ్ రైళ్ల కోసం లార్హే ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను విజయవంతంగా అభివృద్ధి చేశారన్నారు. హైపర్ లూప్ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీని కూడా ఐసిఎఫ్‌లో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్ రంగాలలో యువత సమర్థవంతంగా రాణిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నైపుణ్యం కలిగిన యువత భారత్ లో ఉన్నారని, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో వారు గణనీయమైన పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: రైలు టికెట్ ను ఫ్యామిలీ మెంబర్స్ కి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?