Anvesh on Bhaiya sunny yadav..గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ ను ఒక్కొక్కరిగా ఐడెంటిఫై చేసి పోలీసులు కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక యూట్యూబర్ నాని అరెస్ట్ అవ్వగా.. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మరో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై కేస్ ఫైల్ అయింది. తాజాగా నూతనకల్ పోలీసులు.. తన సోషల్ మీడియా అకౌంట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. గతంలో కాసులకు కక్కుర్తి పడి, అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదని, మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారని డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊసలు లెక్క పెట్టక తప్పదు అని సజ్జనార్ హెచ్చరించినా కొంతమంది వినలేదు. ఇక దాంతో ఆయనే రంగంలోకి దిగారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్న యూట్యూబర్స్ ను ఒక్కొక్కరినిగా వెతికి మరి అరెస్టు చేస్తూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే భయ్యా సన్నీ యాదవ్ పై 111(2), 318(4)46 r/w, 61(2) BNs 3, 4, TSGA 66C66, DITA 2000-2008 ఇలా పలు సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేశారు.
యూట్యూబర్ సన్నీ యాదవ్ పై అన్వేష్ కామెంట్స్..
ఇకపోతే సజ్జనార్ రంగంలోకి దిగడంతో ఒక్కొక్కడి పై కేసు నమోదు అవ్వడమే కాకుండా వారందరిని అరెస్టు చేస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పుడు ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో అరెస్ట్ అయిన వారి గురించి.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్(Anvesh ) స్పందిస్తూ.. చేస్తున్న కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆ యూట్యూబర్స్ గురించి , వారి నిజస్వరూపాల గురించి బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యపరిస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న యూట్యూబర్ నాని గురించి పలు కామెంట్లు చేసిన అన్వేష్ .. ఇప్పుడు భయ్యా ఫన్నీ యాదవ్ గురించి చెబుతూనే, అతడి ఆస్తుల వివరాలు కూడా బయటపెట్టారు. ముఖ్యంగా ఈ యూట్యూబర్ ఆస్తుల వివరాలు వింటే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. మరి సన్నీ యాదవ్ ప్రాపర్టీ గురించి అన్వేష్ ఏం చెప్పాడు అనే విషయాలు ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ గా మారాయి.
సన్నీ యాదవ్ ఆస్తులను బయటపెట్టిన యూట్యూబర్ అన్వేష్..
ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు సంపాదించుకున్న యూట్యూబర్ అన్వేష్ వివిధ ప్రదేశాలకు వెళ్తూ.. అక్కడి విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే సన్నీ యాదవ్ రహస్యాలు బయటపెట్టారు. అన్వేష్ మాట్లాడుతూ.. “బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భాగంగా భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు వెతుకుతుండగా అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ అబ్బాయి రూ.30 కోట్ల రూపాయలను బెట్టింగ్ యాప్స్ ద్వారా అక్రమంగా ఎలా సంపాదించారు తెలుసుకుంటే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంత పెద్ద స్కామ్ ఎలా చేయగలిగారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. ముఖ్యంగా ఆడినోడి కంటే ఆడిపించినోడికే ఎక్కువ డబ్బులు అన్నట్టు ఇతడి ద్వారా బెట్టింగ్ యాప్ కంపెనీలు బెట్టింగ్ యాపలను ప్రమోట్ చేయించి ,ఇతడికి భారీగా ముట్ట చెప్పారు . ముఖ్యంగా ఇతడికి రూ.8కోట్ల విలువైన మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఈ విషయాన్ని ఆయనే తన యూట్యూబ్ ద్వారా తెలియజేశారు. ఒక్కొక్క అంతస్తులో 20 ఫ్లోర్లు ఉంటాయి. ఆ నూతనకల్ ప్రదేశంలోనే ఈయనను మించిన ఇల్లు లేదు. అంతేకాదు ఆ ఇంట్లో లిఫ్ట్ కూడా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా యూట్యూబ్లో పని చేస్తున్నారు కానీ యూట్యూబ్ నుంచి అతనికి పెద్దగా ఆదాయం లేదు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారానే భారీగా సంపాదించాడు. ఈయన దగ్గర జాగ్వార్ స్పోర్ట్స్ కారు కూడా ఉంది. అత్యంత ఖరీదైన మూడు స్పోర్ట్స్ బైకులతో పాటు రెండు మామూలు బైకులు కూడా ఉన్నాయి. ఒక న్యూస్ ఛానల్ పెట్టుకున్నాడు.ఇక మూడు బినామీ షాపులు కూడా ఉన్నాయి. ఎందుకంటే తన దగ్గర ఉన్న డబ్బుకి జిఎస్టి ఎగరగొట్టడానికి. షాపులు కూడా ఎప్పుడు ఓపెన్ చేసి ఉండవు. కానీ అవి బినామీ కంపెనీలు. ఇతనికి MNC కంపెనీ కూడా ఉంది. ఇంత అక్రమ ఆస్తి సంపాదన, ఆయనకు బెట్టింగ్ యాప్ ల ద్వారానే వస్తోంది” అంటూ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తెలిపాడు.