Flaxseed Gel For Hair: జుట్టును సిల్కీగా, మెరిసేలా, బలంగా తయారు చేయడానికి డబ్బు చాలా ఖర్చు చేసే వారు కూడా లేకపోలేదు. కానీ ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కొన్ని రకాల హోం రెమెడీస్ జుట్టుకు మేలు చేస్తాయి. జుట్టుకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. మీరు మీ జుట్టుకు అవిసె గింజలను వాడవచ్చు. ఇవి జుట్టుకు అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తాయి.
అవిసె గింజలతో తయారు చేసిన హెయిర్ జెల్‌ను మీ జుట్టుకు అప్లై చేస్తే.. ఎప్పటికీ ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్ వాడాల్సిన అవసరం ఉండదు. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న అవిసె గింజలతో హెయిర్ జెల్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజలతో.. హెయిర్ జెల్ :
ఒక పాన్‌లో 1 చిన్న కప్పు అవిసె గింజలు తీసుకోండి. తర్వాత ఒక ప్యాన్ లో కప్పు నీరు వేసి మరిగించండి. అందులో ఫ్లాక్ సీడ్స్ వేయండి. దీనిని లిక్విడ్ చిక్కబడే వరకు మరిగించాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి.. ఫిల్టర్ చేయండి. ఇప్పుడు దానికి కొన్ని చుక్కల ఆయిల్ కలిపి చల్లారనివ్వండి. అనంతరం ఒక కంటైనర్‌లో నింపండి. ఇప్పుడు మీ అవిసె గింజల జెల్ సిద్ధంగా ఉంది. ఈ జెల్‌ను వారానికి మూడుసార్లు జుట్టుకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి.
జుట్టుకు అవిసె గింజల జెల్ ఎలా అప్లై చేయాలి ?
ముందుగా మీ జుట్టును వాష్ చేసి ఆరనివ్వండి. దీని తర్వాత మీ జుట్టుకు అవిసె గింజల జెల్ అప్లై చేయండి. మీ జుట్టులో ఒక్క భాగం కూడా పొడిగా ఉండకుండా దీన్ని పూర్తిగా జుట్టుకు పూయండి.
దీని తరువాత దాదాపు 30 నుండి 40 నిమిషాలు ఆరనివ్వండి. హెయిర్ జెల్ జుట్టుపై పూర్తిగా ఆరిపోయిన తర్వాత, తలస్నానం చేయండి. దీనివల్ల మీ జుట్టు చాలా మృదువుగా మారుతుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. జుట్టుకు అవసరమైన పోషణను కూడా అందిస్తాయి.
ఫ్లాక్స్ సీడ్ జెల్ యొక్క ప్రయోజనాలు:
అవిసె గింజల్లో బి విటమిన్లు ఉంటాయి. ఇవి మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా వేగంగా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. చుండ్రు సమస్యకు అవిసె గింజలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇది హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. తద్వారా చుండ్రు నుండి ఉపశమనం అందిస్తుంది.
Also Read: అమ్మమ్మల కాలం నాటి ఈ చిట్కాలు పాటిస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం
అవిసె గింజల్లో విటమిన్ E కూడా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్, వాపు ప్రభావాలను తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. దీంతో పాటు ఇందులోని ప్రోటీన్ జుట్టుకు పోషణనిస్తుంది. కాలక్రమేణా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
అవిసె గింజలు తేమ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టు పొడిబారడాన్ని తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా అవిసె గింజలు విటమిన్ E, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి.