Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీం 264 పరుగులు చేసింది. 49.3 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయింది ఆస్ట్రేలియా. ఈ తరుణంలో 265 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… దూకుడుగా ఆడుతోంది టీం ఇండియా. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ… ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడుతున్న రోహిత్ శర్మ… అంపైర్ ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్ట్రెయిట్ డ్రైవ్ చాలా బలంగా ఆడాడు.
Also Read: IND vs AUS: ఆస్ట్రేలియా ఆలౌట్… టీమిండియా టార్గెట్ ఎంతంటే ?
అయితే ఆ బంతి నేరుగా అంపైర్ క్రిస్ గాఫ్నీ తల పైకి వెళ్ళింది. అయితే బంతి రావడాన్ని గమనించిన అంపైర్ క్రిస్ గాఫ్నీ… వెంటనే నేలపై పడిపోయాడు. లేకపోతే ఆ బంతి నేరుగా వచ్చి అంపైర్ తలకు తాకేది. నిజంగానే అంపైర్ క్రిస్ గాఫ్నీకి తాకుంటే… ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ లో విషాదమే జరిగేది. అంత బలంగా రోహిత్ శర్మ బండకేసి కొట్టాడు. అయితే రోహిత్ శర్మ షార్ట్ కొట్టడం… అంపైర్ తప్పించుకొని నేలపై పడుకున్న వీడియో… ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇక ఈ ఎపిసోడ్ నేపథ్యంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ గ్రౌండ్లోనే నవ్వుకుంటూ… అంపైర్ ను పలకరించారు. ఇక రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీని చూసి నేను తప్పించుకున్నాను అన్న ఫీలింగ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు ఫీల్డ్ అంపైర్. ఇక అంతకు ముందు… ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఒక ఆట ఆడుకున్నారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ.
టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వైపు విరాట్ కోహ్లీ బంతి విసిరాడు. అయితే ఆ బంతిని కుల్దీప్ యాదవ్ పట్టుకోకుండా వదిలేశాడు. వెనకాలే రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి ఆ బంతిని అందుకున్నాడు. లేకపోతే ఆ బంతి నేరుగా ఫోర్ వెళ్లేది. అయితే ఇది గమనించిన విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి కుల్దీప్ యాదవ్ను బండ బూతులు తిట్టారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా.. 22 ఓవర్లు ముగిసే సమయానికి.. రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 110 పరుగులు చేసింది. దిల్ అలాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజు లో .. విరాట్ కోహ్లీ అలాగే శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఇద్దరు హాఫ్ సెంచరీ చేసుకునేలా కనిపిస్తున్నారు. మరో 155 పరుగులు చేస్తే టీమిండియా గ్రాండ్ విక్టరీ కూడా పడుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే… మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉండనుంది.
Also Read: Rizwan Babar Dropped: పాక్ లో ప్రకంపనలు.. జట్టు నుంచి రిజ్వాన్, బాబర్ ఔట్.. కొత్త కెప్టెన్ ప్రకటన ?
SMASHED IT!
Rohit Sharma’s boundary has everyone thinking, should umpires start wearing helmets?#ChampionsTrophyOnJioStar 👉 🇮🇳🆚🇦🇺 LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!
📺📱 Start Watching FREE on JioHotstar: https://t.co/B3oHCeWFge pic.twitter.com/cAbrKgMezk
— Star Sports (@StarSportsIndia) March 4, 2025