E-Paper
Advertisement

ఆసియా కప్ ఫైనల్ చేరినా సుఖం లేదు…టీమిండియాకు తలనొప్పిగా మారిన మొహ్సిన్ నఖ్వీ

ఆసియా కప్ ఫైనల్ చేరినా సుఖం లేదు…టీమిండియాకు తలనొప్పిగా మారిన మొహ్సిన్ నఖ్వీ
Advertisement

Trolls On Mohsin Naqvi:  అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో ( ACC Men’s U19 Asia Cup 2026) టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జూనియర్ జట్ల (India vs Pakistan) మధ్య ఫైనల్స్ జరుగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆసియా కప్ ఫైనల్ లో గెలిచినా, టీమిండియాకు పెద్ద ప్రయోజనం ఉండదని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ తీసుకునేందుకు టీమిండియా ప్లేయర్లు నిరాకరిస్తారని అంచనా వేస్తున్నారు. గతంలో సూర్య కుమార్ యాదవ్, హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరూ ఆసియా కప్ గెలిచినా ట్రోఫీని వదిలేసి ఇండియాకు వచ్చేశారు.

టీమిండియాకు తలనొప్పిగా మారిన మొహ్సిన్ నఖ్వీ

శనివారం జూనియర్ టీమిండియా గెలిచినా ట్రోఫీని మర్చిపోవాల్సిందేనని అంటున్నారు. ఈ తరుణంలోనే మ్యాచ్ ఆడకుండా ఒమన్ నుంచి వెనక్కి వస్తే బెటర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే పాకిస్తాన్ జట్టును ఓడించి, ట్రోఫీని నఖ్వీని ముఖాన పడేయండి అంటూ సలహాలు ఇస్తున్నారు. మ్యాచ్ బాయ్ కాట్ కంటే, తలపడి పాకిస్తాన్ ను చిత్తు చేయాలని అంటున్నారు. ఎవరు గెలిచినా టైటిల్ మాత్రం నఖ్వీ లేపేయడం గ్యారెంటీ అంటూ నెటిజెన్స్ సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు. టైటిల్ దిగించినట్టుగా నఖ్వీ (Mohsin Naqvi) ఫోటోలను క్రియేట్ చేసి, ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ ఎప్పుడంటే ?

అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో ఆఫ్గాన్, బంగ్లా జట్లను చిత్తు చేసి పాకిస్తాన్, టీమిండియా ఫైనల్‌కు చేరాయి. దీంతో దాయాదుల మధ్య నవంబర్ 14న అంటే శనివారం ఉదయం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నమెంట్‌కు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ముఖ్య అతిథిగా హాజరై, విజేతకు ట్రోఫీ అందించనున్నాడు. ఒకవేళ భారత్ గెలిస్తే, ట్రోఫీ తీసుకోకుండా వెనక్కి రానుంది. గతంలోనూ సూర్య కుమార్, హర్మన్ ఇలానే చేశారు. కాగా, అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో ( ACC Men’s U19 Asia Cup 2026) రెండో సెమీ ఫైనల్‌లో ఆఫ్గాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. గురువారం ఒమన్ అల్ అమీరత్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆఫ్గాన్, భారత జూనియర్ జట్ల మధ్య సెమీస్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 8 వికెట్లు నష్టపోయి 227 పరుగులే సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జూనియర్ జట్టు ఆచితూచి ఆడింది. 36.5 ఓవర్లు ఆడిన భారత్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

Advertisement

 

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

 

 

Related News

కండల వీరుడు The Rockకు భయంకరమైన వ్యాధి..30 కిలోలు తగ్గిపోయిన డ్వేన్ జాన్సన్

షాహిద్ అఫ్రిది దుర్మార్గుడు…ఇస్లాం మ‌తంలోకి మారాల‌ని టార్చ‌ర్ చేశాడు

కోహ్లీ జోలికి వ‌స్తే త‌న్వీర్ అహ్మ‌ద్ తాట తీస్తా…గౌత‌మ్ గంభీర్ వార్నింగ్

SRHకు తాకిన‌ ‘సాండ్ పేపర్’ వివాదం…అడ్డంగా దొరికిపోయిన కావ్య మార‌న్ !

పాకిస్తాన్ ను ఒడించేందుకు ఇర్ఫాన్ ప‌ఠాన్ తో క‌లిసి వసీం అక్రమ్ కుట్ర‌లు!

వాంఖ‌డే స్టేడియంలోనే హార్దిక్ ప్యాండ్యా.. ముంబై భ‌ర‌తం ప‌డ‌తాడు

వ‌న్డేల్లోనూ అభిషేక్ శ‌ర్మ బ‌రిలోకి దిగితే, 50 ఓవ‌ర్ల‌లో 600 కొట్ట‌డం ప‌క్కా

Big Stories

Advertisement
×