E-Paper
Advertisement

స్టార్ హీరోల సినిమాలకు అదే మైనస్.. కక్కుర్తి పడితే ఇదే జరిగేది..?

స్టార్ హీరోల సినిమాలకు అదే మైనస్.. కక్కుర్తి పడితే ఇదే జరిగేది..?
Advertisement

Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకునేవి. కానీ ఈ మధ్య సినిమాలకు అన్ని అనుకూలంగా ఉన్నా కూడా ఏదో వెనక్కి లాగినట్టుగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కేవలం బడ్జెట్కు మాత్రమే మిగిలాయి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్న స్టార్ హీరోల సినిమాలు పెద్దగా జనాలని ఆకట్టుకోవడం లేదు. చిన్న సినిమాలు గా ఎటువంటి ఆర్భాటం లేకుండా థియేటర్లలో రిలీజ్ అయినవి మాత్రమే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన టాక్సిక్ చిత్రం మాత్రం డిజాస్టర్ టాక్ ని అందుకున్నట్లే కనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో పాటుగా ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించలేదు. అసలు స్టార్ హీరోలు సినిమాలకి ఏదైనా శాపం తగిలిందా అన్న అనుమానాలు కూడా కొందరిలో కలుగుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు ఎక్కడ మైనస్ అవుతుందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

చిన్న సినిమాలకు డిమాండ్ ఎక్కువే..

గత రెండు నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన చిన్న సినిమాలకు మంచి క్రేజ్ రావడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. సమంత నటించిన మా ఇంటి బంగారం, వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు, తమిళ హీరో సూర్య నటించిన విశ్వనాథన్ సన్స్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచాయి. ఈ సినిమాలకు టికెట్ల ధరలను పెంచలేదు. ముందుగా ఫిక్స్ చేసిన టికెట్స్ రేట్లతోనే సినిమాలను రిలీజ్ చేశారు.. ఈ సినిమాలు అన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.. ఈ సినిమాల నుంచి రిలీజ్ అయిన టీజర్లు ట్రైలర్లు మాత్రమే సినిమాకు పాజిటివ్ టాక్ ని అందించాయి. ప్రమోషన్స్ కూడా ఈ సినిమాలు ఎక్కువగా చేయలేదు.. కానీ సూపర్ హిట్ అయ్యాయి.

నిర్మాతలకు అదే పెద్ద మైనస్..

Advertisement

ఈమధ్య పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్న విషయం చెప్పనక్కర్లేదు. ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో మంచి టాక్ ని సొంతం చేసుకోవాలని ఎన్నో ఆశలతో థియేటర్లలోకి వస్తున్నాయి. చిన్న సినిమాల సంగతి పక్కన పెడితే పెద్ద సినిమాలుగా వచ్చిన సినిమాలు యావరేజ్ టాక్అందుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తుంటారు.. స్టార్ హీరోల సినిమాలకి అలాంటి పరిస్థితి రావడానికి కారణం కేవలం టికెట్ల రేట్ల పెంపే అని ఒక వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంది. టికెట్ రేట్ గురించి ఆలోచించి చాలామంది సినిమా ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు మొదలవుతున్నాయి. అయినా కూడా నిర్మాతలు మాత్రం టికెట్ల రేట్ల పెంపు కోసమే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ సినిమాకు అయితే టికెట్ ధరలు పెరిగి ఉంటాయో ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాలను అందుకోలేక పోతుంది. ఇప్పుడు రిలీజ్ అయిన టాక్సిక్ మూవీ పరిస్థితి కూడా అదే అని పబ్లిక్ రియాక్షన్స్ చూస్తే అర్థమవుతుంది.. నిన్న మొన్న వరకు ఈ సినిమా రిలీజ్ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉండేవి. టికెట్ల ధరలు ఎప్పుడైతే పెరిగాయో అప్పుడు సినిమా గురించి మాటలు కూడా తగ్గినట్లు తెలుస్తుంది.. ఇప్పుడు థియేటర్లోకి వచ్చిన తర్వాత సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో ఎస్ అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు ఇదే పెద్ద మైనస్ అని చెప్పాలి. టికెట్ల ధర పెంచకుండా ఉంటే సినిమా హిట్ అయ్యేది అన్న వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి. మరి దీనిపై నిర్మాతలు ఇప్పటికైనా తమ తీరుని మార్చుకుంటారేమో చూడాలి..

Also Read :Podarillu Today Episode : విక్కీకి చక్రీ ఝలక్.. కన్నాకు సపోర్ట్ గా మహా.. మాధవ్ కు నిజం చెప్పిన శైలు..

Related News

వారణాసి కోసం సందీప్ కీలక నిర్ణయం.. ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

మాసోడు అప్పుడే మొదలెట్టేశాడురో.. షూటింగ్ అప్పుడే స్టార్ట్..?

అందరి చూపు ఆమె వైపే.. గీతూ గట్టెక్కుతారా? ‘టాక్సిక్’తో ఆ జాబితాలోకి చేరతారా?

హీరోయిన్ ను నమ్మించి మోసం చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. పోలీసు కేసు నమోదు..

యష్ ‘టాక్సిక్ ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

హైదరాబాద్‌లో ఈ థియేటర్లు ఉండేవని తెలుసా..?

యూత్‌ను టార్గెట్ చేసిన ‘రోమాంచకం’.. ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది!

Big Stories

Advertisement
×