E-Paper
Advertisement

పవన్, రీతూ చౌదరి జంటకి అవమానం.. శ్రీముఖిపై నెటిజన్స్ ఫైర్!

పవన్, రీతూ చౌదరి జంటకి అవమానం.. శ్రీముఖిపై నెటిజన్స్ ఫైర్!
Advertisement

Sree Mukhi:ఇటీవల కాలంలో పలు టీవీ ఛానల్స్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఛానల్స్ తమ షోల టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడానికి సరదాగే చేసినా.. ఆయా సెలబ్రిటీల అభిమానులను మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెరపై సెలబ్రిటీ జంటగా గుర్తింపు తెచ్చుకున్న డెమోన్ పవన్ (Demon Pawan), రీతూ చౌదరి(Rithu Chowdary) జంటను షోకు పిలిపించి మరీ శ్రీముఖి (Sreemukhi) అవమానించడంపై రీతూ చౌదరి, డెమోన్ పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పిలిచి మరీ అవమానిస్తారా ? అలాంటప్పుడు పిలవడం ఎందుకు ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో డెమోన్ పవన్, రీతూ చౌదరి జంట..

శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ సీజన్ 2 కి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో నిర్వాహకులు విడుదల చేయగా.. ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఈ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లోని సెలబ్రిటీలు రెండు టీములుగా విడిపోయి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ లేటెస్ట్ సీజన్ ఎపిసోడ్ ప్రోమోలో కుకు విత్ జాతి రత్నాలు వర్సెస్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం అంటూ పోటీ మొదలుపెట్టారు.

Advertisement

also read:అయ్యప్ప భక్తుడిగా మారిన డేవిడ్ వార్నర్..

రీతూ  ,పవన్ జంటను అవమానించిన శ్రీముఖి..

ప్రోమో విషయానికి వస్తే.. రాకింగ్ రాకేష్ కుకు విత్ జాతి రత్నాలు షోలో టాప్ 5 లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే టైటిల్ అందుకోలేకపోయారు. కానీ తాజాగా ఆయన ఆదివారం విత్ స్టార్ మా పరివారం కి మాస్క్ పెట్టుకుని రావడంతో.. శ్రీముఖి మాట్లాడుతూ..” ఎంత షో చేసినంత మాత్రాన ముఖం చూపించుకోలేకపోతున్నావా?” అని అడగ్గా.. హరి మాట్లాడుతూ..”పాపం ఈయన చేసిన వంటలకు మొహం చూపిస్తే బయట కొడుతున్నారు అంటూ పంచ్ వేశాడు. శ్రీముఖి మాట్లాడుతూ..” మన పరివారం కి పోటీగా అదేదో టీం వచ్చింది. వారికి ఏదైనా చెప్తావా?” అంటూ ప్రియాంక (Priyanka Jain) ను శ్రీముఖి అడిగింది. వాళ్ల గురించి ఏం చెబుతాం శ్రీ అని.. ప్రియాంక అంటుండగానే సుహాసిని కలుగజేసుకొని ఇప్పుడే సెట్ వెనకాల ఏమన్నది.. అబ్బా సెట్ ఎంత బాగుందో అంటూ చెప్పింది అంటూ సుహాసిని బదులిచ్చింది. దానికి శ్రీముఖి మాట్లాడుతూ.. సెట్ బాగుంది.. కానీ ఆ సెట్లో సెట్ అయ్యే వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది తెలుసా ? అదే మా పాయింట్ అంటూ డెమోన్ పవన్ రీతు చౌదరి వైపు చూపించింది. అటు రాకేష్, రీతు చౌదరి , పవన్ అంతా ముఖం మార్చుకున్నట్టు చూపించారు.

శ్రీముఖిపై నెటిజన్స్ ఫైర్..

Advertisement

కానీ చూసే వారికి మాత్రం పాపం అనిపించింది. పిలిచి మరీ ఇలా అవమానించాలా ?ఇది ఎంటర్టైన్మెంట్ అంటారా? అంటూ శ్రీముఖిపై మండిపడుతున్నారు. ముఖ్యంగా ఓవరాక్షన్ తగ్గించుకో.. ఒక సెలబ్రిటీని షోకి పిలిపించినప్పుడు ఎంటర్టైన్మెంట్ అందించాలి కానీ అవమానించేలా ఎంటర్టైన్మెంట్ చేయాల్సిన అవసరం లేదు.. అంటూ ఆమెకు సలహాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా రీతు చౌదరి, డెమోన్ పవన్, అటు రాకింగ్ రాకేష్ అభిమానులు శ్రీముఖి పై మండిపడుతున్నారు.

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×