Big Stories

Cough Syrup Deaths : పిల్లల ప్రాణాలు తీసిన దగ్గుమందు.. భారతీయుడికి 20 ఏళ్లు జైలు శిక్ష

- Advertisement -

Cough Syrup Deaths in Uzbekistan : భారత్ లో తయారైన దగ్గు మందు ఏకంగా 68 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ కేసులో ఉజ్బెకిస్థాన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రెండేళ్ల క్రితం గాంబియా, ఉజ్బెకిస్థాన్ లలో చాలా మంది పిల్లలు భారత్ లో తయారైన దగ్గుమందు వాడటంతో ప్రాణాలు కోల్పోయారని వార్తలు రాగా.. వాటిని తయారు చేసిన కంపెనీలు.. ఆ ఆరోపణలను కొట్టిపారేశాయి. ఆ దగ్గు మందుల కారణంగానే 2019 నుంచి 2020 మధ్య 12 మంది పిల్లలు చనిపోయారన్న ఆరోపణలూ వచ్చాయి. అయితే వాటి తయారీలో ఎలాంటి ప్రాణాంతక రసాయనాలు లేవని కంపెనీలు చెప్పగా.. వాటిలో నిషేధిత డ్రగ్ కాంబినేషన్లో క్లోర్ఫెనిరామైన్ మేలియేట్, ఫినైలెఫ్రిన్ ఔషధాలున్నాయని పలు పరిశోధనల్లో తేలింది.

- Advertisement -

Read More :మెట్రోలో రైతుకు నో ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో

దగ్గమందు మృతుల కేసులో.. నిందితులుగా ఉన్నవారిలో ఒకడైన భారతీయుడు సింగ్ రాఘవేంద్ర ప్రతార్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. యూపీకి చెందిన మారియన్ బయోటెక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈ దగ్గు సిరప్ ను తయారు చేయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక ఇచ్చింది. ఈ సంస్థకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తోన్న క్యురామాక్స్ మెడికల్ లో రాఘవేంద్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారుల మరణాల కేసులో ప్రతార్ సహా మరో 22 మందికి జైలుశిక్ష ఖరారు చేసిన ఉజ్బెకిస్థాన్ కోర్టు. వీరిలో భారతీయుడైన రాఘవేంద్ర ప్రతార్ కే ఎక్కువ కాలం శిక్షను విధించింది.

నిందితులు పన్ను ఎగ్గొట్టడం, నాసిరకం మందులను అమ్మడం, నిర్లక్ష్యం, ఫోర్జరీ, లంచం వంటి నేరాలకు పాల్పడినట్లు కోర్టు అభిప్రాయపడింది. రాయిటర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. సదరు కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న మందులకు లైసెన్సింగ్ బాధ్యత వహించిన మాజీ సీనియర్ అధికారులను కూడా దోషులుగా నిర్థారించి జైలు శిక్ష ఖరారు చేసింది. కాగా.. దగ్గు మందు తాగి ప్రాణాలు కోల్పోయిన 68 మంది చిన్నారుల కుటుంబాలకు ఒక బిలియన్ ఉజ్బెక్ డాలర్లు (80 వేల అమెరికా డాలర్లు) పరిహారంగా చెల్లించాలని ఉజ్బెకిస్తాన్ కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే దగ్గు సిరప్ కారణంగా ప్రభావితమైన మరో 8 మంది పిల్లల తల్లిదండ్రులు 16 వేల నుంచి 40 వేల డాలర్ల వరకూ నష్టపరిహారాన్ని పొందనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News