BigTV English

Rajya sabha election 2024: 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌.. విపక్షాలకు క్రాస్‌ ఓటింగ్‌ భయం

Rajya sabha election 2024: 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌.. విపక్షాలకు క్రాస్‌ ఓటింగ్‌ భయం

Rajya sabha election for 15 seats


Rajya sabha election for 15 seats: సార్వత్రిక ఎన్నికలకు ముందు మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. 56 స్థానాలకు గాను ఇప్పటికే 41 మంది నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 10, హిమాచల్‌ ప్రదేశ్‌లో 1, కర్ణాటకలో 4 మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్ మొదలైన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులను, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురిని బరిలోకి దింపడంతో ఒక సీటుపై గట్టి పోటీకి జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

Read More: మెట్రోలో రైతుకు నో ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో

కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్, మాజీ ఎంపీ చౌదరి తేజ్వీర్ సింగ్, సీనియర్ రాష్ట్ర నాయకుడు అమర్‌పాల్ మౌర్య, మాజీ మంత్రి సంగీత బల్వంత్ (బైంద్) పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది, మాజీ ఎమ్మెల్యే సాధనా సింగ్, ఆగ్రా మాజీ మేయర్ నవీన్ జైన్‌లను బీజేపీ బరిలోకి దింపింది.

సమాజ్‌ వాదీ పార్టీ నుంచి ఎంపీ జయాబచ్చన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అలోక్ రంజన్, దళిత నేత రామ్‌జీ లాల్ సుమన్‌లను రంగంలోకి దింపింది. మరోవైపు కర్ణాటకలో, అధికార కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను సోమవారం ఒక ప్రైవేట్ హోటల్‌కు తరలించింది. పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం లేదని రాష్ట్ర పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొట్టిపారేశారు.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×