BigTV English

HanuMan, Eagle OTT Dates: ఓటీటీలోకి ఒకేరోజు హనుమాన్, ఈగల్.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..!

HanuMan, Eagle OTT Dates: ఓటీటీలోకి ఒకేరోజు హనుమాన్, ఈగల్.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..!

Hanuman - Eagle Movies Ott Releases


Hanuman – Eagle Movies OTT Releases: క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎవరూ ఊహించని రెస్పాన్స్‌తో బడా హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి దూసుకుపోయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది.

ఇక అదే సమయంలో మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ వంటి బడా హీరోల మూవీలు రిలీజ్ అయ్యాయి. కానీ వాటన్నింటి వెనక్కి నెట్టి ఈ హానుమాన్ మూవీ సంక్రాంతి రేసులో విజయం సాధించింది. ఇక థియేటర్లలో ఈలలు, గోలలు వేయించిన ఈ మూవీ కలెక్షన్లతో కూడా దుమ్ముదులిపేసింది.


దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టేసింది. ఇక థియేటర్ అనంతరం ఈ మూవీని ఓటీటీలో వీక్షించేందుకు ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకొచ్చి వైరల్‌గా మారింది.

READ MORE: ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ సింగిల్, టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మెగా ఫ్యాన్స్‌కు పండగే..!

హనుమాన్ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ మూవీని మార్చి 2న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీపిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది. ఇక ఈ సినిమాతో పాటు రీసెంట్‌గా రిలీజైన మాస్ మహారాజా రవితేజ మూవీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రవితేజ, కావ్యా థాపర్ జంటగా నటించిన సినిమా ‘ఈగల్’. ఫిబ్రవరి 9న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కాస్త డల్ అయింది. దాదాపు రూ.22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈగల్ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

READ MORE: మహేష్ బాబు – రాజమౌళి సినిమా కోసం హాలీవుడ్ డైరెక్టర్లు.. ప్లాన్ మామూలుగా లేదు..!

ఇక థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈగల్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీని త్వరలో స్ట్రీమింగ్ చేస్తామని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తాజాగా ప్రకటించింది. అయితే హనుమాన్ మూవీ స్ట్రీమింగ్ రోజే ఈ మూవీ కూడా మార్చి 2న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు చిత్రాలు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ను నమోదు చేసుకుంటాయో చూడాలి.

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×