BigTV English

Azam Cheema: 26/11 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి.. లష్కరే తోయీబా ఇంటలిజెన్స్ చీఫ్ చీమా మృతి..

Azam Cheema: 26/11 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి.. లష్కరే తోయీబా ఇంటలిజెన్స్ చీఫ్ చీమా మృతి..


Azam Cheema: లష్కరే తోయీబా(LeT) ఇంటెలిజెన్స్ చీఫ్ ఆజం చీమా (70) ఫైసలాబాద్‌లో గుండెపోటుతో మరణించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇటీవలి నెలల్లో అనేక మంది లష్కరే తోయీబాకు చెందిన అనేక మంది టెర్రరిస్టులు చనిపోయిన నేపథ్యంలో చీమా మరణం కేవలం ఊహాగాలేనని పాక్‌ జీహాద్ వర్గాలు తెలిపాయి.

అనేక మంది లష్కరే తోయీబా కార్యకర్తల హత్యల వెనుక భారత ఏజెన్సీల హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది, దీనిని భారతదేశం ఖండించింది.


అటువంటి ‘హత్యల జాబితా’ ఏదీ తమ వద్ద లేదని భారత్ పేర్కొన్నప్పటికీ, నిజంగా అలాంటిది ఉంటే JUD చీఫ్ హఫీజ్ సయీద్, JeM చీఫ్ మౌలానా మసూద్ అజార్‌లతో పాటు చీమా అగ్రస్థానంలో ఉండేవారు.

Read More: కట్టుదిట్టమైన భద్రత.. వేలాది మంది రష్యన్ల నినాదాల నడుమ నావల్నీ అంత్యక్రియలు..

చీమా 26/11 ముంబై దాడులు, జూలై 2006 ముంబై రైలు బాంబు దాడులకు ప్రధాన కుట్రదారులలో ఒకరు. అంతేకాకుండా చీమా భారతదేశంలో అనేక ఇతర ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు.

టాప్ టెర్రరిస్టులు పాకిస్తాన్‌లో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారని భారత్ ఆరోపిస్తూ వస్తుంది. దీన్ని పాక్ తిరస్కరిస్తున్నా చీమా మరణం మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.

చీమా 2008లో పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌కు LeT కమాండర్‌గా పని చేస్తున్నప్పుడు, అతను లష్కరే తోయీబా సీనియర్ కార్యకర్త జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీకి ఆపరేషన్స్ అడ్వైజర్‌గా నియమితులయ్యాడు. 26/11 ముంబై దాడులలో రిక్రూట్‌లకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రణాళిక, అమలులో పాల్గొన్నాడు.

యుఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ చీమాను LeT కార్యకలాపాలలో ‘కీ కమాండర్’గా అభివర్ణించింది. ఇది ఉసామా బిన్ లాడెన్ అల్-ఖైదా నెట్‌వర్క్‌తో లింక్‌లను కలిగి ఉందని పేర్కొంది. LeTని విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా డిసెంబర్ 2001లో US, మే 2005లో UN కమిటీ పేర్కొంది.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×