Chhattisgarh: వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికి నక్సలిజాన్ని అంత చేస్తామన్నది కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట. ఆ విధంగా బలగాలు అడుగులు వేస్తున్నాయి. గతేడాది నుంచి ఇప్పటివరకు మావోలకు కోలుకోని దెబ్బ తగిలింది. వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. అయినా మావోల ఆగడాలు తగ్గుముఖం పట్టడంలేదు.
తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని బలగాలు చెబుతున్నాయి. అసలేం ఏం జరిగింది? ఛత్తీస్‌గఢ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.
బీజాపూర్‌లో నేషనల్ పార్క్ సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు-మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మావోలు పెద్ద ఎత్తున సమావేశం అవుతున్నట్లు బలగాలు సమాచారం రావడంతో రంగంలోకి దిగాయి.
తొలుత మావోల నుంచి ఫైరింగ్ మొదలైంది. చివరకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఉదయం ఐదు గంటల సమయంలో మొదలైన ఫైరింగ్ దాదాపు నాలుగైదు గంటలపాటు జరిగినట్టు తెలుస్తోంది. క్రమంగా తుపాకుల చప్పడు తగ్గడంతో గాలింపు మొదలుపెట్టాయి డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు. ఘటన జరిగిన ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి బలగాలు. అయితే మావోల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: ఢిల్లీ సీఎం రేసులో ఆ ‘నలుగురు’
ఈ ఏడాది మొదలు జనవరి నుంచి ఇప్పటివరకు మావోలకు కీలక దెబ్బ తగిలింది. కీలక నేతలను బలగాలు మట్టుబట్టాయి. గతేడాది ఒక్క ఛత్తీస్‌ఘడ్‌లో వివిధ ఎన్‌కౌంటర్లలో దాదాపు 220 మంది మావోలు మరణించారు. గడిచిన ఐదేళ్లలో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువని పోలీసులు చెబుతున్నారు.
మావోయిస్టుల ఏరివేత కారణంగా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మావోలు విధ్వంసాలు చేపడతారని బలగాలు అంచనా వేశాయి. జనవరి నుంచి ఇప్పటివరకు 60 మందిని మట్టుబెట్టారు. మృతదేహాల స్వాధీనం చేసుకోలేదు. ఎక్కువ మంది చనిపోయే ఉంచవచ్చని భావిస్తున్నారు. తాజా ఎన్‌కౌంటర్‌కు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ఈ వారంలో నలుగురు గ్రామస్తులను అతి కిరాతంగా చంపేశారు మావోయిస్టులు. వారంతా ఇన్‌ఫార్మర్లుగా భావించి ఫ్యామిలీ సభ్యుల కళ్లెదుటే దారుణంగా నరికేశారు. పంచాయితీ ఎన్నికల ముందు ఇటు మావోలు దూకుడుగా వెళ్తున్నారు. బలగాలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.