Big Stories

KTR Rude Behaviour: కేటీఆర్.. ఏ క్యా బాత్ హై!

KTR news today in telugu

- Advertisement -

KTR news today(Telangana politics): అధికారం పోయినా అహంకారం పోలేదు. ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదు. ఇది ఫ్రస్టేషనా లేక.. దిగజారుడుతనంలో కొత్త స్థాయా..? చేసిన తప్పేంటో ఇంకా తెలియడం లేదా? తెలిసినా ఏం చేస్తారులే అన్న ధీమానా? ఇదేనా పదేళ్లు మంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల తారకరామారావు నడుచుకునే పద్ధతి.. ఇదేనా తెలంగాణ ప్రజలకు సమాధానం ఇచ్చే పద్ధతి..

- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ ఓ పెద్ద క్రైమ్.. మావోయిస్టులు, టెర్రరిస్టుల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయాలి. అది కూడా హోమ్ సెక్రటరీ అనుమతితోనే.. వాళ్లు కూడా ప్రజల మేలు జరుగుతుందని అంటేనే అనుమతిస్తారు..
అలాంటి ట్యాపింగ్‌ను కేటీఆర్ చాలా లైట్ తీసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో చట్టానికి వ్యతిరేకంగా చేసిన పనిని వెనకేసుకొచ్చారు. నిజంగానే మీరు సంఘ విద్రోహ శక్తుల ఫోన్లు ట్యాప్ చేసి ఉంటే..
మిమ్మల్ని ప్రజలు నెత్తిన పెట్టుకునేవారు. ఇప్పుడు మిమ్మల్ని ఏ నోటితో అయితే విమర్శిస్తున్నారో.. అదే నోటితో ప్రశంసలు కురిపించేవారు. కానీ మీరు చేసింది ఏంటి?

మీరు ట్యాప్‌ చేసిన ఫోన్లు ఎవరివి? విపక్ష నేతలవి, వాళ్ల అనుచరులవి.. మీ అనుచరులవి, సొంత కుటుంబసభ్యులవి. వ్యాపారవెత్తలవి ఎందుకు అధికారం మీ చేతుల నుంచి వెళ్లకుండా జాగ్రత్త పడటం కోసం వ్యాపారులను బెదిరించి డబ్బూలు వసూలు చేయడం.. విపక్ష పార్టీలకు ఆర్థికసాయం అందకుండా చేయడం. ఇందులో ప్రజలకు జరిగిన మేలేంటి? వాళ్లకు ఒరిగిందేంటి? అంతా మీ లాభం కోసమే కదా?
స్వకార్యం కోసం అన్ని పనులు చేసి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా బరితెగించి సమర్థించుకోవడం ఏంటి?

Also Read: ఇద్దరు అధికారులకు ఐదురోజుల కస్టడీ, పరారీలో ఆ వ్యాపారులు..!

ఏమైంది.. రెండు పిల్లర్లు కుంగాయి.. రిపేర్ చేస్తే సరిపోతుంది కదా.. ఇది కేటీఆర్‌ చెబుతున్న మాట.. ఎంత సింపుల్‌గా చెబుతున్నారు కేటీఆర్ గారు.. లక్షన్నర కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ అది మూడేళ్లకే ప్రాజెక్ట్ కుంగితే.. ఇంత లైట్‌గా తీసుకుంటారా? సింపుల్‌గా రిపేర్లు చేయాలి అంటున్నారు. అది నిజంగా అంత సింపుల్‌గా తేలే వ్యవహారమా? ప్రస్తుతం మొత్తం ప్రాజెక్టు డిజైన్లపైనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది NDSA. పదేళ్లు మంత్రిగా చేసిన మీకు ఈ విషయాలు తెలియవా? లేక తెలిసి కూడా కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారా? ఈ ప్రశ్నలు మనం వేసేవి కాదు. బీఆర్ఎస్‌ నేతల నుంచే ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇలాంటి బిహేవియర్‌తోనే ముందుకు వెళ్తే.. ఇప్పటికే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాస్త అసహ్యంగా మారే అవకాశం ఉంది.

నిజానికి కేటీఆర్ బలం మాట్లాడటం.. అదే మాటలతో ప్రజలను మెస్మరైజ్ చేయగలరు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన మాటలను అధికారం కవర్ చేసేది. కానీ ఇప్పుడు ఆయన విపక్షంలో ఉన్నారు..
కానీ ఆయన మాట తీరు మారలేదు..బాధ్యతారాహిత్యంగా చేస్తున్న వ్యాఖ్యలు..ఆయనకు మేలు చేయడం అటుంచి కీడు చేసే అవకాశమే ఎక్కువ.

ఇదంతా ఒక ఎత్తైతే.. కేటీఆర్ ఐపీఎల్ మ్యాచ్‌పై చేసిన ట్వీట్‌ మరో ఎత్తు.. ముంబై, సన్‌ రైజర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌పై ఆయన ఓ ట్వీట్ వేశారు. పవర్ హిట్టింగ్‌ అంటూ హైదరాబాద్‌ బాదిన 277 స్కోర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. థ్యాంక్యూ ఫర్‌ ఎంటర్‌టైనింగ్ హైదరాబాద్‌.. అంటూ బాటమ్ లైన్ కూడా పెట్టారు. కానీ ఈ ట్వీట్‌పై విరుచుకపడ్డారు నెటిజన్స్.. సన్ రైజర్స్‌ పవర్ హిట్టింగ్‌ ఏమో కానీ.. తమ రిప్లై ట్వీట్స్‌తో ఓ ఆట ఆడేసుకున్నారు. కేటీఆర్‌ను తమ ట్వీట్‌ హిట్టింగ్‌తో ఓ ఆట ఆడేసుకున్నారు. చెల్లి అరెస్ట్‌ అయ్యి తీహార్ జైల్లో ఉన్నారు. ఓ వైపు అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ టైమ్‌లో మీరు మ్యాచ్‌ చూసి చిల్ అవుతున్నారంటే ఇది మాములు విషయం కాదంటున్నారు నెటిజన్లు.

అటు మాటలు.. ఇటు చేతలు.. రెండింటిలోనూ తన చేష్టలతో రోజురోజుకు దిగజారిపోతున్నారన్న విమర్శలు మాత్రం పెరుగుతున్నాయి.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News