BigTV English

USA: 45 ఏళ్ల వయస్సులో 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించాలని…

USA: 45 ఏళ్ల వయస్సులో 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించాలని…

USA: వయస్సు పెరుగుతన్న కొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం. అయితే కొందరు మాత్రం వయస్సు పెరిగినా తాను యువకుడిలానే కనిపించాలని అనుకుంటారు. ఇందుకోసం యోగా, వ్యాయామం లాంటివి చేస్తుంటారు. వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా కొత్త ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలానే అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్త 45 ఏళ్ల వయస్సులోనూ 18 ఏళ్ల యువకుడిలా కనిపించాలని ప్రత్యేకమైన చికిత్స తీసుకుంటున్నాడు. ఇందుకోసం ఏకంగా ఏడాదికి 2 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాడు. అంటే భారత కరెన్సీలో రూ. 16 కోట్లు.


కాలిఫోర్నియాకు చెందిన జాన్సన్ అనే బిజినెస్‌మ్యాన్.. శరీరంలో కొన్ని మార్పులు చేస్తే వయసు ప్రభావం కనిపించకుండా దీర్ఘాయువు పొందవచ్చని ఇంటర్నెట్‌లో చదివాడు. దీంతో 45 ఏళ్ల వయస్సులో కూడా 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించేందుకు వైద్యులను సంప్రదించాడు. ప్రస్తుతం 30 మంది వైద్యులు అతడ్ని పర్యవేక్షిస్తున్నారు. చికిత్స తీసుకున్న తర్వాత గుండె పనితీరు 37 ఏళ్ల వ్యక్తిలా, శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సమార్థ్యం 18 ఏళ్ల యువకుడిలా, చర్మం నిగారింపు 28 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నాయని జాన్సన్ తెలిపారు.

తన శరీరంలోని ప్రతి అవయవం 18 ఏళ్ల యువకుడిలా మారేంత వరకు చికిత్స కొనసాగిస్తానని అన్నారు. చికిత్స కోసం ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ప్రత్యేక పరికరాలతో ల్యాబ్‌ను సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించాడు.


Related News

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Big Stories

×