BigTV English

Lucknow Cylinder Blast: ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

Lucknow Cylinder Blast: ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

Uttar Pradesh cylinder blast


Uttar Pradesh cylinder blast(Telugu news headlines today):యూపీలోని ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లక్నో జిల్లా, కకోరిలోని హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలోని రెండంతస్తుల భవనంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే సిలిండర్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దంపతులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఇందులో అమాయక పిల్లలు కూడా ఉన్నారు.

హతా హజ్రత్ సాహెబ్ నివాసి ముషీర్ అలీ (50), జర్దోసీ పనితో పాటు పటాకుల వ్యాపారి కూడా.
ఈ ఘటన మంగళవారం రాత్రి సమయంలో ఆయన ఇంటి నుండి మంటలు చెలరేగాయి.
మంటలు చెలరేగిన కొద్ది నిమిషాలకే సిలిండర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చే సమయానికి మంటలు ఇల్లంతా వ్యాపించాయి.


read more: ఇండియాతో వివాదం.. చైనాతో మాల్దీవుల కొత్త సైనిక ఒప్పందం..

ముషీర్, అతని భార్య హుస్నా బానో (45), అతని మేనకోడలు రాయ (5), ఇద్దరు మేనకోడళ్లు హిబా (2), హుమా (3) మంటల్లో సజీవ దహనమయ్యారు. మిగిలిన వాళ్ళు ఎలాగోలా బయటకి వచ్చారు. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం తెలుసుకున్న అగ్నమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్తలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గురైన ఇంటిపై మంటలను అదుపు చేశారు. మంగళవారం రాత్రి సమయంలో 10 :30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తమకు తెలిసిందని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించామని స్థానిక పోలీసులు తెలిపారు.

బనోయి అజ్మత్ (30), మేనకోడలు అనమ్ (17)తో పాటు ఇంట్లో చిక్కుకున్న ముషీర్ ఇద్దరు కుమార్తెలు ఇన్షా (16), లకబ్ (18)లను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారిని బయటకు తీశారు. చికిత్స వీరి ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయతో ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలని అక్కడ ఉన్న పోలీస్ అధికారి సూచించాడు.

 

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×