BigTV English

Safina Namukwaya: 70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు.. ఇలా సాధ్యంమైంది

Safina Namukwaya: 70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు.. ఇలా సాధ్యంమైంది

Safina Namukwaya: అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలిగే టెక్నాలజీ మన దగ్గర ఉంది. 40 ఏళ్లు కాదు కదా.. 30 దాటిన మహిళలే పిల్లల్ని కనడం కష్టంగా ఉంటున్న ఈ రోజుల్లో 70 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటుచేసుకుంది.


ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ ప్రస్తుత వయసు 70 ఏళ్లు. సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా ఆమె తాజాగా కవలపిల్లలకు జన్మనిచ్చింది. కంపాలా నగరంలోని ఆసుపత్రిలో బుధవారం ఆమెకు సిజేరియన్ ద్వారా ఒక బాబు, ఒక పాప పుట్టారు. తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఇన్ విట్రో ఫలదీకరణ చికిత్స ద్వారా ఆమె సంతానం పొందడం సాధ్యమైందని వైద్యులు వెల్లడించారు. 2020లో సఫీనా ఐవీఎఫ్ ద్వారా ఒక కుమార్తెకు జన్మనివ్వగా.. తాజాగా కవలలకు జన్మనివ్వడంతో.. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించింది.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×