BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (06/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (06/09/2025)

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 6వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:

శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో బాటుగా అభ్యసించండి. అప్పుడే సర్వతోముఖాభివృద్ది సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకొండి. ఇంతకు ముందు మీరు పెట్టిన పెట్టుబడులు ఇవాళ మంచి లాభాలను ఇస్తాయి. లక్కీ సంఖ్య: 4

వృషభ రాశి:

మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీని వలన మీ యొక్క ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో మీరు ప్రయోజనం పొందుతారు. లక్కీ సంఖ్య: 3


మిథున రాశి:  

విభేదాల వల్ల  కొంత త్తిడిని ఎదుర్కొంటారు.  అనవసర విషయాలకు డబ్బును ఖర్చు చేస్తారు. మీరు మీ ఆర్థికస్థిని మెరుగు పరుచుకోవాలంటే మీ జీవిత భాగస్వామితో, తల్లితండ్రులతో మాట్లాడండి. మీరు ఆఫీసు పనిలో మరీ అతిగా లీనమైపోవడం వలన మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి. లక్కీ సంఖ్య :1

కర్కాటక రాశి:

వెంచర్ల నుంచి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంతుంది. ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు. కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండగలరు. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చు. లక్కీ సంఖ్య: 5

సింహ రాశి:

మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి. ఎందుకంటే  మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారి తీయవచ్చును. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. లక్కీ సంఖ్య: 3

కన్యారాశి :

మీరు కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలను వాడడం మీ శ్రీమతికి కోపం తెప్పించగలదు. మీరు ప్రయాణం చేసి  ఖర్చు పెట్టే మూడ్ లో ఉంటారు.   ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనడం జరుగుతుంది. ప్రశంసనీయమైన పనులనే చెయ్యండి. లక్కీ సంఖ్య: 2

 

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది మాటలతోనే పొగుడుతారు. ఖర్చు చేయడం వల్ల జరిగే అనర్థాలు మీకు అర్థం అవుతాయి. అందువల్ల ఈ రోజు నుండి డబ్బులు ఆదా చేయడం ప్రారంభించండి. అధిక వ్యయాన్ని నివారించండి. లక్కీ సంఖ్య: 4

వృశ్చికరాశి:

ఈరోజు మీ ఆరోగ్యం సహకరించనందున మీరు మీ పనిమీద శ్రద్ధ ఉంచలేకపోతారు. జీవితములోని చీకటి రోజుల్లో ధనము మీకు చాలావరకు ఉపయోగపడుతుంది. కావున మీరు ఈరోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. లక్కీ సంఖ్య:2

ధనస్సు రాశి:

నిరంతరం సమయస్ఫూర్తి  అర్థం చేసుకోవడం లతో కూడిన ఓర్పును మీరు వహిస్తే  మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఇంటి పనులలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకొండి. అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి లక్కీ సంఖ్య: 3

మకరరాశి:

అంతులేని మీ ఆ విశ్వాసం, మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక, మీకు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి.  కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మీ శ్రీమతితో తగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది. లక్కీ సంఖ్య: 3

కుంభరాశి:

మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహార యాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ధన లాభాలు మీరు అనుకున్నంతగా రావు. మీ మనసు నుండి సమస్యలన్నిటినీ పారద్రోలండి. ఇంటిలోను  స్నేహితులలోను మీ పొజిషన్ ని పెంచే పనిలో ధ్యాస పెట్టండి. లక్కీ సంఖ్య: 9

మీనరాశి:

ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. మానసికంగా తుఫాను తెస్తాయి. ఇక మీరు అసలు ఏమి చెయ్యాలో తెలీని అయోమయంలో పడిపోతారు. ఇతరుల సహాయం తీసుకొండి. త్వరగా డబ్బును సంపాదించాలని మీకు కోరిక కలుగుతుంది. మీ కుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ చక్కగా ఆనందించండి. లక్కీ సంఖ్య: 7 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Dreams: కలలో ఆ దేవుళ్ళు కనిపిస్తే జాగ్రత్త – అసలు స్వప్న శాస్త్రం ఎం చెప్తుందంటే

lunar eclipse: చంద్రగ్రహణం నుంచి ఆ రాశుల జాతకులకు రాజయోగం పట్టనుందట – ఆ రాశులేవో తెలుసా..?

Girl Names: ఆడపిల్లలకు ఆ పేర్లు అస్సలు పెట్టకూడదట – ఆ పేర్లేంటో తెలుసా..?

Worship Gods: ఏ దేవుణ్ణి ఎప్పుడు పూజించాలో తెలుసా..? మెరుగైన ఫలితాల కోసం ఇలా చేయండి

Touching Feet: కొందరి పాదాలకు మొక్కితే దరిద్రం పట్టుకుంటుందట – వాళ్లెవరో తెలుసా..?

Big Stories

×