BigTV English

Afghanistan Plane Crash | ‘ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిన భారత విమానం’.. క్లారిటీ ఇచ్చిన ఇండియా!

Afghanistan Plane Crash | శనివారం రాత్రి ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని కొండ ప్రాంతంలో ఒక విమానం కూలిపోయింది. అయితే ఇది భారత్ విమానమని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

Afghanistan Plane Crash | ‘ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిన భారత విమానం’.. క్లారిటీ ఇచ్చిన ఇండియా!

Afghanistan Plane Crash | ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని కొండ ప్రాంతంలో శనివారం, జనవరి 20 రాత్రి ఒక విమానం కూలిపోయింది. అయితే ఇది భారత్ విమానమని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.


‘‘ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన విమాన ప్రమాదం దురదృష్టకరం. అయితే ఆ కూలిన విమానం భారత్ నుంచి రష్యా రాజధాని మాస్కోకు బయలుదేరింది. కానీ అది భారతీయ విమానం కాదు. అది మొరాకోకి చెందిన ఒక చిన్న విమానం. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,” అని ట్విట్టర్‌లో భారత పౌర
విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ విమాన ప్రమాదంపై రష్యా ప్రభుత్వం స్పందించింది. ఈ విమానం ఒక ఎయిర్ ఆంబులెన్స్‌ అని భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా రష్యా వస్తున్న సమయంలో విమానం హిందూ కుష్ పర్వతాలలో కూలిపోయిందని రష్యా అధికారులు తెలిపారు. ఇది ఒక రష్యన్-రిజిస్టర్డ్ విమానం ఆఫ్ఘనిస్తాన్‌ గగన తలంలో ప్రవేశించాక అది రాడార్‌లో కనిపించలేదని.. ఈ విమానంలో ఆరుగురు ప్రయాణికులు కూడా బయలుదేరారని వివరాలు వెల్లడించారు.


అయితే ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఎటువంటి సమాచారం అందలేదని తెలిసింది. ప్రయాణికులు బ్రతికే ఉన్నారా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు. ఘటనా స్థలానికి ఆఫ్ఘనిస్తాన్ రెస్క్యూ టీమ్స్ బయలుదేరినట్లు తెలుస్తోంది.

Related News

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Big Stories

×