BigTV English

CM Revanth Reddy :మూసీ రివర్ ఫ్రంట్.. అర్బన్ డెవలప్ మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..

CM Revanth Reddy : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్, అర్బన్ డెవలప్ మెంట్, గ్రీన్ స్పేసెస్‌పై.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. దుబాయ్‌లో 70కి పైగా ప్రపంచ డిజైన్, ప్లానింగ్.. ఆర్కిటెక్చర్ సంస్థలు, కన్సల్టెన్సీలు, నిపుణులతో ఆయన చర్చలు జరిపారు. మూసీ ప్రక్షాళణపై.. ప్రపంచ అర్బన్ మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, సిటీ స్కేప్ డిజైనర్లు భాగస్వామ్యంపైనా సీఎం దృష్టి సారించారు. 56 కిలోమీటర్ల పొడవైన మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి, వాణిజ్య వ్యాపారాలు,పెట్టుబడి నమూనాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

CM Revanth Reddy :మూసీ రివర్ ఫ్రంట్.. అర్బన్ డెవలప్ మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..
Political news in telangana

Revanth reddy today news(Political news in telangana):

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్, అర్బన్ డెవలప్ మెంట్, గ్రీన్ స్పేసెస్‌పై.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. దుబాయ్‌లో 70కి పైగా ప్రపంచ డిజైన్, ప్లానింగ్.. ఆర్కిటెక్చర్ సంస్థలు, కన్సల్టెన్సీలు, నిపుణులతో ఆయన చర్చలు జరిపారు. మూసీ ప్రక్షాళణపై.. ప్రపంచ అర్బన్ మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, సిటీ స్కేప్ డిజైనర్లు భాగస్వామ్యంపైనా సీఎం దృష్టి సారించారు. 56 కిలోమీటర్ల పొడవైన మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి, వాణిజ్య వ్యాపారాలు,పెట్టుబడి నమూనాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.


గ్లోబల్ సంస్థలు, యూరప్, మిడిల్ ఈస్ట్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. హైదరాబాద్, తెలంగాణతో భాగస్వామ్యం చేయడానికి పలు సంస్థలు.. ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో తెలంగాణలో పలు అర్బన్ డెవలప్ మెంట్ సంస్థలు పర్యటించనున్నాయి.

నదితీరంలో ఉన్నా నగరాలు అభివృద్ది సాధించాయని.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన తర్వాత
హైదరాబాద్‌..అరుదైన నగరంగా ప్రపంచంస్థాయిలో గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందస్తు ప్రణాళిక నమూనాలను రూపొందించాలని ఆయా సంస్థలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తాను.. ఇతర నగరాలు, రాష్ట్రాలతో పోటీ పడడం లేదని…వాటి సరసన తెలంగాణ నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు రేవంత్ చెప్పారు.


Tags

Related News

Ramreddy Damodar Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇక లేరు

Kavitha: లక్ష మందితో బతుకమ్మ పండుగ చేసి చూపిస్తా.. కవిత కీలక వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు..!

Telangana Politics: అనిరుధ్ రెడ్డి vs కేటీఆర్, ప్రతీది రాజకీయమే.. స్వేచ్ఛ మీ దగ్గరెక్కడ?

Telangana politics: మొదలైన స్థానిక ఎన్నికల వేడి.. సీఎం రేవంత్ కీలక భేటీ, ఏడున అభ్యర్థుల ప్రకటన

Minister Uttam: తెలంగాణలో ఈసారి రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి.. దేశంలో మరోసారి అత్యధికంగా..?

Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు

Free Bus Ticket: డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వలేదని.. బస్సు కింద పడుకుని మహిళ హల్ చల్

Big Stories

×