BigTV English

Double Womb: కవలలు.. పుట్టిన‌రోజే వేర్వేరు

Double Womb: కవలలు.. పుట్టిన‌రోజే వేర్వేరు

Double Womb: ఆ ఇద్దరూ కవలలు. పుట్టిన రోజు మాత్రం ఒకటి కాదు. ఇదెలా సాధ్యం? అనే కదూ అనుమానం. సైన్స్‌లో అరుదుగా చోటు చేసుకునే ఘటనల్లో ఇదొకటి. అమెరికాలోని అలబామాకు చెందిన కెల్సే హేచర్(32) ఈ నెల 19వ తేదీ రాత్రి 7.45 గంటలకు ఒకరికి, పది గంటల అనంతరం(అంటే మరుసటి రోజు) మరొకరికి జన్మనిచ్చింది.


రెండు గర్భాశయాలు ఉండటం వల్ల ఇలా వేర్వేరు రోజుల్లో ఆమెకు కవలలు పుట్టారని బర్మింగ్‌హాంలోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా(UAB) ఆస్పత్రి వైద్యులు వివరించారు. పదిలక్షల కాన్పుల్లో ఒకటి మాత్రమే ఇలాంటిది చోటు చేసుకుంటుందని చెప్పారు. రెండు గర్భాశయాలు ఉన్నా.. జననాలు విజయవంతమయ్యే అవకాశాలు మాత్రం చాలా స్వల్పం. అయితే హేచర్, ఇద్దరు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని UAB వైద్యులు తెలిపారు. ఇలా పుట్టే కవలలను ఫ్రెటర్నల్ ట్విన్స్‌గా వ్యవహరిస్తారు.

ఇద్దరూ ఆడ శిశువులు కావడంతో హేచర్ ఇంట క్రిస్మస్ పండుగ ఆనందం రెట్టింపు అయింది. జంట గర్భాశయాలు (యుటెరెస్ డైడెల్‌ఫిస్) ఉన్న విషయం ఆమెకు 17వ ఏట తెలిసింది. పుట్టుకతో వచ్చే ఈ లోపం అత్యంత అరుదు. మహిళల్లో 0.3 శాతం మంది మాత్రమే ఇలా డబుల్ యుటెరెస్‌తో జన్మిస్తారట.


హాచర్ రెండు రోజుల్లో కవలలను జన్మనిచ్చింది కానీ..2019లో బంగ్లాదేశ్ మహిళ ఒకరికి నెల రోజుల తర్వాత కవల బిడ్డ పుట్టిందని వైద్యులు చెప్పారు. హాచర్ ఇంతకుముందు మూడు కాన్పులు జరిగాయి. ఈ సారి ప్రెగ్నెన్సీ కూడా అలాగే ఉంటుందని భావించింది. రెండో గర్భాశయంలోనూ బేబీ ఎదుగుతున్నట్టు అల్ట్రాసౌండ్ రొటీన్ పరీక్షలో బయటపడింది.

Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×