E-Paper
Advertisement

Aliens Might Be Living Among Us: అమెరికా భయం నిజమైంది, గ్రహాంతరవాసులు మన మధ్యే..

Aliens Might Be Living Among Us: అమెరికా భయం నిజమైంది, గ్రహాంతరవాసులు మన మధ్యే..
Advertisement

Aliens Might Be Living Among Us: కోయి మిల్ గయా సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 21 ఏళ్ల కిందట బాలీవుడ్‌లో వచ్చింది. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. గ్రహాంతరవాసులు భూమి మీదకు ఎలా ఉంటారనేది కళ్లకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ ‌రాకేష్‌రోషన్.

ఆ తరహా సినిమాలు హాలీవుడ్‌లో చాలానే వచ్చాయి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. ఏలియన్స్ అంటే అమెరికా ప్రజలకు ఊహించలేనంత భయం. తమ సంపదను దోచుకుపోవడానికే అమెరికాలో తిరుగుతున్నారనేది బలమైన టాక్ అక్కడి ప్రజల్లో బలంగా ఉంది. అఫ్ కోర్స్ ఇప్పటికే ఆ భయం ఉందనుకోండి. ఇక అసలు విషయానికొద్దాం.

Advertisement

ఏలియన్స్ కోసం దశాబ్దాలుగా అన్వేషణ జరుగుతోంది. కానీ, వాటికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇప్పటికే లేదు. తాజాగా అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు దీనికి సంబంధించి ఓ విషయాన్ని బయటపెట్టారు. భూమిపై మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు జీవిస్తున్నట్లు తెలిపారు. రూపం మార్చుకుని మనుషుల మధ్య రహస్యంగా ఉంటున్నారన్నది అసలు పాయింట్. గ్రహాంతర జీవులకు సంబంధించి ఫ్లయింగ్ సాసర్లు (యూఎఫ్‌వో)పై ఏర్పాటు చేసిన హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్‌లో తమ పరిశోధనలను ప్రచురించారు.

ALSO READ:  కువైట్ అగ్నిప్రమాదం, మృతుల్లో ముగ్గురు తెలుగువారు

Advertisement

ఏలియన్స్ భూగర్భం, చంద్రుడిపై మన మధ్య జీవిస్తూ ఉండవచ్చిని అభిప్రాయపడింది. భూమిపై నివసించే గ్రహాంతరవాసుల కోసం ఫ్లయింగ్ సాసర్లు వచ్చివుండవచ్చనే కోణంలో పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. అంచనా అయితే వేసిందికానీ, వీటిని నిర్థారించే ఎలాంటి ఆధారాలు బయటకు పెట్టలేదు. మొత్తానికి ఏలియన్స్‌పై హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన ఆసక్తి రేపే సరికొత్త అంశాన్ని బయటపెట్టిందనే చెప్పవచ్చు.

అన్నట్లు ఆ మధ్య ఇంగ్లాండ్‌లో ఓ మహిళ అచ్చం ఏలియన్స్ మాదిరిగానే ఉంది. తెల్లడి చర్మం, ఏలియన్స్ మాదిరిగా సన్నగా ఉండడం కనిపించింది. అంతేకాదు ఫోటోలు తీయడం కనిపించింది. ఆ మహిళను అక్కడి మనుషులు విచిత్రంగా చూశారు. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయిన విషయం తెల్సిందే.

 

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×