Kuwait Building Fire updates(Latest international news today): కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం 45 మంది భారతీయులు మరణించారు. వారిని అధికారులు కూడా గుర్తించారు. అందులో ముగ్గురు తెలుగువారు ఉన్నారు. కేరళ నుంచి 24 మంది, తమిళనాడు నుంచి ఏడుగురు ఉన్నారు. ఒడిషా నుంచి ఇద్దరు, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, బెంగాల్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒకొక్కరుగా ఉన్నారు. అందులో ఇంజనీర్లు, డ్రైవర్లు, సూపర్వైజర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులున్నారు. ఇక కువైట్‌లోని అతి పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎన్‌బీటీసీ. ఎక్కువ మంది బాధితులు ఈ కంపెనీ నుంచే ఉన్నారు.
ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు చనిపోయారని, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వెల్లడించింది. వారిలో శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలానికి చెందిన లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలానికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడు కు చెంది ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలకు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు పేర్కొంది.
శ్రీకాకుళానికి చెందిన లోకనాథం అగ్నిప్రమాదానికి ముందు కువైట్‌లోని సంబంధిత అపార్ట్‌మెంటుకు చేరుకున్నాడు. తెల్లవారితే డ్యూటీలో చేరే అవకాశం ఉంది. ఈలోగానే ప్రమాదం జరిగింది. గురువారం ఆయనకు కుటుంబసభ్యులు ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో అనుమానం వచ్చి ఆయా కంపెనీలో వాకబు చేయడంతో మరణించినట్టు తేలింది.
ALSO READ: ఉక్రెయిన్‌కు రూ.4.17 లక్షల కోట్ల రుణం.. జీ7 దేశాల నిర్ణయం
ఇదిలావుండగా మృతదేహాలను కువైట్ నుంచి భారత్‌కు తరలించేందుకు అక్కడ విమానాలను సిద్ధం చేశారు. కువైట్‌లోని అల్ మంగాఫ్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది కార్మికులు చనిపోయారు. అందులో 45 మంది భారతీయులు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులకు సహాయం చేసేందుకు బుధవారం రాత్రి కువైట్‌కు వెళ్లారు విదేశాంగ సహాయమంత్రి కీర్తివర్థన్ సింగ్. బాధితులకు సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. అక్కడి వ్యాపారవేత్తలు మృతుల కుటుంబాలకు కొంత నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
MoS @KVSinghMPGonda visited Jahra hospital and interacted with 6 Indians admitted there. He appreciated the good care provided to the Indian patients for faster recovery. pic.twitter.com/o679twIBzo
— India in Kuwait (@indembkwt) June 13, 2024