BigTV English

BNG vs NED ICC Men’s T20 World Cup : గెలిచిన బంగ్లా.. పోరాడి ఓడిన నెదర్లాండ్స్

BNG vs NED ICC Men’s T20 World Cup : గెలిచిన బంగ్లా.. పోరాడి ఓడిన నెదర్లాండ్స్

BNG vs NED ICC Men’s T20 World Cup(Sports news in telugu): టీ 20 ప్రపంచకప్ లో గ్రూప్ డిలో ఉన్న బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య వెస్టిండీస్ లో మ్యాచ్ జరిగింది. నెదర్లాండ్స్ గట్టిగానే పోరాడింది. కానీ చివరికి బంగ్లాదేశ్ విజయం సాధించింది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ముందుగా బౌలింగ్ తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 25 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.


160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ కి సరైన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మిచెల్ లెవిట్ (18), మ్యాక్స్ ఓ డౌడ్ (12) త్వరగా అయిపోయారు. తర్వాత విక్రమ్ జిత్ సింగ్ (26), సైబ్రాండ్ (33), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (25) విజయం వైపు తీసుకెళ్లారు. వీరు ఆడినంత సేపు బాగానే ఉంది. నెదర్లాండ్స్ సులువుగానే గెలుస్తుందని అంతా అనుకున్నారు.

Also Read :10 రుపీకీ పెప్సీ.. కోహ్లీ భాయ్..! విరాట్‌పై అభిమానుల గజల్స్..


కానీ క్రీజులో కుదురుకున్నాక ఒకొక్కరుగా అవుట్ అయిపోయారు. మొత్తానికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 25 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బంగ్లా బౌలింగులో రెహ్మాన్ 1, సకీబ్ 1, తస్కిన్ అహ్మద్ 2, రిషద్ 3, మహ్మదుల్లా 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఒక దశలో పరుగులు చేయడానికి చాలా కష్టాలు పడింది. చివరి 5 ఓవర్లలో ఫోర్లు, సిక్స్ లు ధనాధన్ కొట్టడంతో స్కోరు అమాంతం పెరిగింది. లేకపోతే అదే థీమ్ తో వెళ్లి ఉంటే, మ్యాచ్ నిలబెట్టుకోవడం కష్టమయ్యేది.

బ్యాటింగ్ ప్రారంభించాక ఓపెనర్ కెప్టెన్ శాంతో (1) పరుగు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ తంజిద్ హాసన్ మాత్రం 26 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన లిటన్ దాస్ (1), తౌహిద్ హ్రదయ్ (9) తక్కువకే అవుట్ అయ్యారు. ఈ సమయంలో సెకండ్ డౌన్ వచ్చిన షకీబ్ అల్ హాసన్ గోడలా నిలబడిపోయాడు. 46 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తనకి మహ్మదుల్లా (25), జకీర్ అలీ(14 నాటౌట్) సపోర్ట్ గా నిలిచారు. మొత్తానికి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి పోరాడే స్కోరు ఇచ్చారు. నెదర్లాండ్స్ బౌలింగులో ఆర్యన్ దత్ 2, పాల్ వాన్ మీకరన్ 2, టిమ్ ప్రింగిల్ 1 వికెట్ పడగొట్టారు.

Tags

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×