BigTV English

America : అమెరికాలో రికార్డ్ స్థాయిలో చలి.. నిలిచిపోయిన రెండు వేలకుపైగా విమానాలు..

America : అమెరికాలో రికార్డ్ స్థాయిలో చలి.. నిలిచిపోయిన రెండు వేలకుపైగా విమానాలు..

America : అమెరికాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రిస్‌మస్ సమీపిస్తున్న వేళ పండుగ ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధంగా మారింది. మంచు, వాన, గాలి , శీతల ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యమంతటా రవాణా సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. మంచు కురవడంతో పాటు ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా విమాన సర్వీసులను నిలిపి వేసింది అమెరికా ప్రభుత్వం


దేశ అధ్యక్ష్యుడు జో బైడెన్ సైతం ఈ మేరకు అమెరికన్లకు సూచనలు జారీ చేశారు. ఇవి మీరు చిన్నప్పుడు చూసిన మంచు రోజులు కాదు..చాలా తీవ్రమైన పరిస్థితులని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు సైక్లోన్‌గా బలపడే ప్రమాదం ఉందని ‘అక్యూవెదర్’ సంస్థ తెలిపింది. ఇదే క్రమంలో న్యూయార్క్ గవర్నర్ ఇతర ప్రాంతాల గవర్నర్లతో కలసి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

తీవ్ర మైన మంచు కురవడంతో వాహనాలు అదుపు తప్పే అవకాశం ఉన్నందున రోడ్డు మార్గంలో ప్రయాణాలు ఆపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అమెరికాలోని ప్రధాన రహదారైన ‘ఇంటర్ స్టేట్ -90’ ని అధికారులు మూసి వేశారు.


Tags

Related News

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

Big Stories

×