BigTV English

America Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పులు..నలుగురు మృతి

America Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పులు..నలుగురు మృతి

America Gun Fire four dead: అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. కెంటకీలోని ఓ ఇంట్లో జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మొత్తం ఏడుగురిపై ఓ దుండగుడు కాల్పులు జరపగా.. నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాధితులను సిన్సినాటిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఫ్లోరెన్స్‌లో ఓ ఇంట్లో బర్త్ డే పార్టీ జరిగింది. ఇంతలో ఓ వ్యక్తి కాల్పులు జరిపి..అక్కడి నుంచి కారులో పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దుండగుడిని పట్టుకునేందుకు కారును వెంబడించారు. ఈ సమయంలో ఆ దుండగుడు కారుతోపాటు లోయలో పడిపోయాడని పోలీసులు వెల్లడించారు.

తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో దుండగుడు తనను తాను కాల్చుకోవడంతో లోయలో పడినట్లు తెలుస్తోంది. గాయాలతో ఉన్న దుండగుడిని ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


Also Read:  ఎన్నికల బరి నుంచి తప్పుకొనేదే లేదు..దేవుడు చెప్తే తప్పా..జో బైడెన్

పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలువడ్డాయి. ఈ బర్త్ డే వేడుకకు చాలామంది అతిథులు వచ్చారని, కానీ 20 ఏళ్ల దుండగుడికి పార్టీకి వచ్చిన వ్యక్తుల గురించి ముందే తెలుసని తేలింది. అయితే ఈ వేడుకకు అతడికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. కాగా, ఫ్లోరెన్స్ లో భారీ కాల్పులు జరగడం ఇదే తొలిసారి అని పోలీసులు వెల్లడించారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×