BigTV English

Sachin Tendulkar in Wimbledon: వింబుల్డన్‌ సెంటర్ కోర్టులో క్రికెట్ లెజెండ్‌కు అరుదైన గౌరవం..

Sachin Tendulkar in Wimbledon: వింబుల్డన్‌ సెంటర్ కోర్టులో క్రికెట్ లెజెండ్‌కు అరుదైన గౌరవం..

Sachin Tendulkar Received Grand Reception in Wimbledon: ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నీ వింబుల్డన్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌‌కు అరుదైన గౌరవం లభించింది. 2024 సీజన్‌కు శనివారం క్రికెట్ లెజెండ్.. తన భార్య అంజలితో హాజరయ్యాడు. సెంటర్ కోర్టులో జెరేవ్, కామెరూను నారీ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించాడు.


SW19 వద్ద సెంటర్ కోర్టులోని రాయల్ బాక్స్‌‌లోకి రాగానే సచిన్‌కు ఘనస్వాగతం లభించింది. వింబుల్డన్ ప్రెజెంటర్ సచిన్ పేరును ప్రకటించి.. ప్రేక్షకులందరిని లేచి నిలబడమని చెప్పి స్టాండింగ్ ఓవేషన్ ఇప్పించారు. ఈ సందర్భంగా సచిన్ సాధించిన విజయాలను ప్రస్తావించారు. 2011 వన్డే ప్రపంచ కప్ విజయం, క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన అతని రికార్డుల ప్రస్తావన తీసుకొచ్చారు.

సచిన్‌తో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ శనివారం సెంటర్ కోర్టుకు హాజరయ్యారు. టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ కూడా వీరితో పాటు ఉన్నాడు. సచిన్, ఫెదరర్‌తో కూడిన ఫోటోను వింబుల్డన్ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మ్యాచ్ తర్వాత వీరు సరదాగా గడిపారు.


Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×