BigTV English

US Police arrest for 4 Telugu people: యూఎస్, నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్.. వీళ్లేమి చేశారో తెలుసా?

US Police arrest for 4 Telugu people: యూఎస్, నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్..  వీళ్లేమి చేశారో తెలుసా?

US Police arrest for 4 Telugu people: అమెరికాలో తెలుగు ప్రజల ఘనత గురించి గొప్పగా చెప్పు కుంటారు. కానీ, మరికొందరు చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ కోవలో వస్తారు నలుగురు తెలుగువాళ్లు. వీళ్లని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..


న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ పోలీసుల వివరాలు ప్రకారం.. గిన్స్‌బర్గ్ ప్రాంతంలో చాలామంది అపార్ట్‌మెంట్లలో పని చేస్తున్నారు. స్థానికుల ద్వారా ఈ విషయం పోలీసులకు సమాచారం వెళ్లింది. వెంటనే అక్కడికి వచ్చి వారిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

డాలస్ కేంద్రంగా పని చేస్తున్న ఓ భారత ఏజెన్సీకి చెందిన నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పనులు చేయించుకుంటున్నారని తేలింది. ఆ వ్యక్తులు నకిలీ కంపెనీలు క్రియేట్ చేసి కొంతమందితో బలవంతంగా పనులు చేయించుకున్నట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది.


ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టడంతో అసలు గుట్టు బయటపడింది. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 13న భారతీయుడు కట్కూరి సంతోష్ ఇంట్లో సోదాలు చేశారు. దాదాపు 15 మందిని గుర్తించారు. దీంతో షాకవ్వడం పోలీసుల వంతైంది. సంతోష్ ఆయన వైఫ్ ద్వారక 15 మంది యువతులతో పని చేయిస్తున్నట్లు తేలింది.

ALSO READ: అమెరికాలో తెలుగు స్టూడెంట్ మృతి, మింగేసిన జలపాతం..

ఈ క్రమంలో ఇంట్లోని ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లతోపాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నా రు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు బయటపడింది. సంతోష్, ఆయన భార్య ద్వారక, చందన్ వాసిరెడ్డి, అనిల్‌మాలె సహకరించినట్టు తేలింది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వీరికి సంబంధించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Tags

Related News

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Big Stories

×