BigTV English

Telugu student dies in US: అమెరికాలో తెలుగు స్టూడెంట్ మృతి, మింగేసిన జలపాతం..

Telugu student dies in US: అమెరికాలో తెలుగు స్టూడెంట్ మృతి, మింగేసిన జలపాతం..

Telugu student dies in US(World news today): అమెరికాలో తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ఎంఎస్ చదువుతున్న అవినాశ్ అనే విద్యార్థి సెలవు కావడంతో ఫ్యామిలీ సభ్యులతో జలపాతానికి వెళ్లాడు. ప్రమాదశాత్తూ నీటిలోపడి ప్రాణాలు కోల్పోయాడు.


అమెరికా మృతి చెందిన విద్యార్థి పేరు గద్దె సాయి సూర్య అవినాశ్. వయస్సు 26 ఏళ్లు. సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం. అమెరికాలో ఉంటున్న అవినాశ్, తోబుట్టువు అక్క దగ్గరే ఉండి ఎం.ఎస్ చదువుతున్నాడు.

ఆదివారం సెలవు కావడంతో అక్క ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్‌ సమీపంలోని అల్బానీ ప్రాంతంలో ఉన్న బార్బర్‌విల్లీ జలపాతానికి వెళ్లాడు. పొరపాటున కాలు జారి జలపాతంలో పడిపోయాడు అవినాశ్. అతడ్ని రక్షించేందుకు మరొకరు అందులోకి దూకాడు. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా మరొకర్ని రెస్క్యూ టీమ్ కాపాడింది.


ALSO READ: నెపోలియన్ గన్స్ వేలం..అత్యధిక ధరకు విక్రయం

అవినాశ్ మృతదేహాన్ని సొంతూరుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొడుకు మరణించిన విషయం తెలియగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్తాడని తాము ఊహించలేదంటూ బోరున విలపించారు. అవినాశ్ గతేడాది జనవరిలో యూఎస్ వెళ్లాడు. నెల కిందట ఇద్దరు తెలుగు విద్యార్థులు వేర్వేరు ప్రాంతాల్లో జలపాతం వద్దకు వెళ్లి మరణించిన విషయం తెల్సిందే.

Tags

Related News

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Big Stories

×