BigTV English

Gun Fire in America: సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు.. అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతి..!

Gun Fire in America: సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు.. అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతి..!

Andhra Man Died in America: అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32) గా గుర్తించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ ఆర్కెన్సాస్ లో ఉన్న ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు. శనివారం (జూన్ 22) మధ్యాహ్నం అతను కౌంటర్లో ఉండగా.. సూపర్ మార్కెట్ లోపలికి వచ్చిన ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో కాల్పులు జరిపాడు.


ఈ కాల్పుల్లో గోపికి తీవ్రగాయాలవ్వడంతో.. అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు షాపులో ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకుని పరారయ్యాడు. ఇదంతా సూపర్ మార్కెట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. తీవ్రగాయాలైన గోపిని సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. కుటుంబ సభ్యులకు గోపి మరణవార్త సమాచారం అందించగా.. వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: Jagan going to Bangalore: జగన్ బెంగుళూరుకి వెళ్తున్నారా? గాలితో మంతనాలు?


గోపీకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు. అతని మరణంతో స్వగ్రామమైన యాజలిలో విషాదఛాయలు అలుముకున్నారు. సిగరెట్ ప్యాకెట్ కోసం తమ కొడుకుని పొట్టన పెట్టుకున్నారంటూ గోపి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. కాగా.. గోపి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Related News

America-Russia: అమెరికా-రష్యా చర్చలు విఫలమైతే భారత్ ని బాదేస్తాం.. తల, తోక లేని ట్రంప్ వార్నింగ్

Tsunami: నిశబ్దంగా.. 100 అడుగుల ఎత్తైన కెరటాలతో ముంచెత్తిన సునామీ, భారీ విధ్వంసం

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

Big Stories

×