Leopard Viral Video: సోషల్ మీడియా హవా నడుస్తున్న ఈ కాలంలో తరచూ ఏదో ఒక వింత వీడియోలు దర్శనమిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం నెట్టింట తరచూ చక్కర్లుకొడుతుంటాయి. అడవుల్లో తిరిగే కౄూర మృగాల వేటకు వెళ్లే వారు లేదా ఫోటో గ్రాఫర్లు జంతువుల వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. జంతువుల దగ్గరకు వెళ్లి వాటి చుట్టు ప్రక్కల వాతావరణం, వేటాడడం, వాటి ఆహారంకు సంబంధించిన చాలా రకాల వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. ఈ తరుణంలో చాలా రకాల వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి.
ఫారెస్ట్ ఆఫీసర్లు సైతం అడవుల్లో జంతు పర్యవేక్షణ కోసం వెళ్లిన సమయంలో వాటికి సంబంధించిన వినూత్న వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ చిరుతకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ చిరుత కోసం అడవిలో ఓ పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో చిరుత ఒక్కసారిగా అటు వైపు వెళ్తూ ముందుగా అద్దాన్ని గమనించలేదు. అనంతరం దాని వెనుక ఏదో ఉందని చూసి వెంటనే అద్దంలో చూసుకోగా బెంబేలెత్తిపోయింది.
అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు అక్కడే మరొక చిరుత ఉందేమో అని అనుకుంది. దీంతో బెదిరిపోయి, అటు ఇటు తిరుగుతూ అద్దంలో చూసుకుంటూ దానిపై దాడి చేయాలని ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చిరుత అయినా సరే అద్దంలో దానిని అది చూసుకుంటే భయపడాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Dog Attack Video: మహిళపై 15 కుక్కలు దాడి.. వీడియో వైరల్
Leopard reacts to seeing himself in a mirror. pic.twitter.com/gsrqKxz3xX
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) June 20, 2024