Anil Sunkara:- అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్‌గా ఏప్రిల్ 28న రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాపై అఖిల్, అక్కినేని ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నప్పటికీ సినిమా ఫలితం నిరాశ పరిచింది. దర్శకుడు సురేందర్ రెడ్డిపై అక్కినేని అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత అనీల్ సుంకర చేసిన ట్వీట్స్ మరింత వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆయన ఏమని ట్వీట్ చేశారంటే..
‘ఏజెంట్ సినిమా విషయంలో వస్తున్న నిందలను మేమే భరించాలి. ఇది కష్టమైన పని అని తెలిసినప్పటికీ గెలవాలని భావించాం. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయటం తప్పు. దీంతో పాటు కోవిడ్ కారణంగా సమస్యలు ఎక్కువయ్యాయి. ఎలాంటి సాకులు చెప్పాలని అనుకోవటం లేదు. ఇదొక ఖరీదైన తప్పు. దీన్నుంచి నేచ్చుకుని తప్పు పునరావృత్తం కాకుండా ఎలా తిరిగొస్తామో చూడండి. మాపై నమ్మకం ఉంచిన అందరికీ థాంక్స్. డేడికేషన్, ప్లానింగ్‌తో రాబోయే సినిమాలను రూపొందించి నష్టాలను భర్తీ చేసుకుంటాం’ అని తెలిపారు అనీల్ సుంకర.
సినిమా రిలీజ్‌కు ముందు ఒకలా మాట్లాడి, ఇప్పుడు మరోలా ట్వీట్ చేయటమేంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే మరి కొందరేమో తప్పును భుజాలపైకి ఎత్తుకోవటం గొప్ప విషయం అంటున్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా పాన్ ఇండియా లెవల్లో ఏం పీకుదామనుకున్నావ్ అని కూడా కొందరు కామెంట్స్ చేశారు.
అఖిల్ అక్కినేని మార్కెట్‌ను మించి నిర్మాతలు ఖర్చు పెట్టారు. అఖిల్ సైతం సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ అంతా చేశాడు. మంచి యాక్షన్ సీన్స్‌లో నటించాడు. ఎన్ని చేసినా మూవీ మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో అఖిల్ సరసన ఢిల్లీ బ్యూటీ సాక్షి వైద్య నటించింది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు.