BigTV English

Arakan Army | భారత సరిహద్దుల సమీపంలో మయన్మార్ రెబెల్ ఆర్మీ.. బార్డర్ టౌన్ ఆక్రమణ!

Arakan Army | ఇండియా పొరుగు దేశం మయన్మార్‌లో దశాబ్దాల నుంచి జరుగుతున్న సాయుధ పోరు తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావం భారత్‌ సరిహద్దుల వద్దకు చేరింది. గత కొన్ని రోజుల్లోనే వందల సంఖ్యలో మయన్మార్ పౌరులు భారత్‌తో దొంగచాటున ప్రవేశించారు.

Arakan Army | భారత సరిహద్దుల సమీపంలో మయన్మార్ రెబెల్ ఆర్మీ.. బార్డర్ టౌన్ ఆక్రమణ!

Arakan Army | ఇండియా పొరుగు దేశం మయన్మార్‌లో దశాబ్దాల నుంచి జరుగుతున్న సాయుధ పోరు తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావం భారత్‌ సరిహద్దుల వద్దకు చేరింది. గత కొన్ని రోజుల్లోనే వందల సంఖ్యలో మయన్మార్ పౌరులు భారత్‌తో దొంగచాటున ప్రవేశించారు. కానీ భారత సైన్యం వారిని పట్టుకొని తిరిగి పంపించేసింది. తాజాగా మయన్మార్‌ విద్రోహుల సైన్యం అరాకన్ ఆర్మీ ఇండియా, బంగ్లాదేశ్ సరిహద్దుల సమీపంలోని మయన్మార్ పట్టణం ‘పాలెట్వా’ని ఆక్రమించుకున్నారని సమాచారం.


పాలెట్వా పట్టణం బంగ్లాదేశ్ సరిహద్దులకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే భారత రాష్ట్రం మిజోరం సరిహద్దు జోరిన్ పుయి.. పాలెట్వా నుంచి 109 కిలోమీటర్ల దూరంలో ఉంది.

1948లో బ్రిటీషర్ల నుంచి స్వాతంత్ర్యం తరువాత నుంచే మయన్మార్‌లో ఆర్మీకి వ్యతిరేకంగా ఈ అరాకన్ విద్రోహులు సాయుధ పోరాటం చేస్తూనే ఉన్నారు. 2021లో మయన్మార్‌లో అంగ సాన్ సూకీ నాయకత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని జుంటా మిలిటరీ కూల్చేసింది. అప్పటి నుంచి జుంటా మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు చేసిన వారే అరాకన్ రెబెల్స్.


తాజాగా నవంబర్ 2023లో మయన్మార‌లో పడమర రాఖైన్, చిన్ రాష్ట్రాలలో మయన్మార్ భద్రతా దళాలు, మయన్మార ఆర్మీపై అరాకన్ రెబెల్స్ ఆర్మీ దాడులు చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో సైనికులు చనిపోయారు. ఇప్పుడు ఈ అరాకన్ రెబెల్స్ భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంగా ఉన్న పలెట్వా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలెట్వా పట్టణం చుట్టూ ఉన్న ఆరు సైనిక స్థావారాలను కూడా ఆక్రమించుకున్నామని అరాకన్ ఆర్మీ ప్రకటించింది. ఈ స్థావరాలు మిజోరం రాష్ట్ర బార్డర్‌లోనే ఉండడం గమనార్హం.

పాలెట్వాలో 2014 జనాభా లెక్కల ప్రకారం 64000 మంది నివసిస్తున్నారు. ఈ పట్టణం నుంచే చైనా-మయన్మార్ మధ్య జరిగే వ్యాపార కేంద్రాలున్నాయి.

ఇంతకుముందు షాన్ రాష్ట్రంలో అరాకన్ రెబెల్స్, మయన్మార్ ఆర్మీ మధ్య నెలల తరబడి జరిగిన సాయుధ పోరాటం.. 2023లో చైనా మధ్యర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగింది. ఈ అరాకన్ రెబెల్స్‌కు రాజకీయ పార్టీల మద్దతు లభిస్తుండడం, ప్రస్తుత పరిస్థితుల్లో మయన్మార్ సైన్యం బలహీనంగా ఉండడంతోనే అరాకన్ ఆర్మీ బలపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×